
స్థానిక పోరుకు ఏర్పాట్లు
● రెండు దశల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ● రెండు దశల్లో సర్పంచ్ ఎన్నికలు
జగిత్యాల: జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచుల ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కావడంతో కలెక్టర్ సత్యప్రసాద్ సంబంధిత వివరాలు ప్రకటించారు. 9న నోటిఫికేషన్ విడుదలవుతుందని, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు 23, 27 తేదీల్లో రెండు దశల్లో నిర్వహించనుండగా.. కౌంటింగ్ నవంబర్11న ఉంటుందన్నారు. సర్పంచ్ ఎన్నికలు 10 మండలాలు ఫేస్–2లో.. మరో 10 మండలాలు ఫేస్–3లో జరుగుతాయని తెలిపారు. ఎస్పీ అశోక్‌కుమార్, అదనపు కలెక్టర్ రాజాగౌడ్ పాల్గొన్నారు.
కౌంటింగ్ కేంద్రాలు
ఎస్‌కేఎన్‌ఆర్ డిగ్రీ కళాశాలలో..
జగిత్యాల, జగిత్యాలరూరల్, కొడిమ్యాల, మలా ల, ధర్మపురి, బుగ్గారం
కండ్లపల్లి మోడల్‌స్కూల్‌లో..
రాయికల్, సారంగాపూర్, బీర్‌పూర్
ఇబ్రహీంపట్నం మోడల్‌స్కూల్‌లో..
మల్లాపూర్, మెట్‌పల్లి, ఇబ్రహీంపట్నం
కల్లూరు మోడల్‌స్కూల్‌లో...
కోరుట్ల, బీమారం, మేడిపల్లి
గొల్లపల్లి మోడల్‌స్కూల్‌లో...
గొల్లపల్లి, పెగడపల్లి, వెల్గటూర్, ఎండపల్లి
రెండు దశల్లో సర్పంచ్ ఎన్నికలు
అక్టోబర్ 21 నుంచి నవంబర్ 4 వరకు
మండలాలు : మేడిపల్లి, బీమారం, కథలాపూర్, కోరుట్ల, మెట్‌పల్లి, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, సారంగాపూర్, బీర్‌పూర్, రాయికల్
అక్టోబర్ 25 నుంచి నవంబర్ 8 వరకు
మండలాలు : ధర్మపురి, బుగ్గారం, మల్యాల, కొడిమ్యాల, ఎండపల్లి, వెల్గటూర్, జగిత్యాలరూరల్, జగిత్యాల, గొల్లపల్లి, పెగడపల్లి
మొదటి విడత పోలింగ్ 10 నుంచి
108 ఎంపీటీసీలు
పోలింగ్ కేంద్రాలు 554
మండలాలు: బీర్‌పూర్, రాయికల్, సారంగాపూర్, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, మెట్‌పల్లి, బీమారం, కథలాపూర్, కోరుట్ల, మేడిపల్లి
రెండో విడత పోలింగ్ 10 నుంచి
108 ఎంపీటీసీలు
పోలింగ్ కేంద్రాలు 569
మండలాలు: బుగ్గారం, ధర్మపురి, ఎండపల్లి, జగిత్యాల, జగిత్యాలరూరల్, కొడిమ్యాల, మల్యాల, పెగడపల్లి, వెల్గటూర్, గొల్లపల్లి
గ్రామపంచాయతీలు 385
వార్డులు 3,536
పోలింగ్ కేంద్రాలు 3,536
పోలింగ్ లొకేషన్స్ 477
క్రిటికల్ పోలింగ్ కేంద్రాలు 244
సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలు 1361
మండలాలు 20
జెడ్పీటీసీ స్థానాలు 20
ఎంపీటీసీ స్థానాలు 216
ఎంపీటీసీ పోలింగ్ కేంద్రాలు 1123
పోలింగ్ లొకేషన్స్ 416
ఓటర్లు 6,07,263
పురుషులు 2,89,266
మహిళలు 3,17,988
ఇతరులు 9
జెడ్పీటీసీ రిటర్నింగ్ ఆఫీసర్లు 20+ (4 రిజర్వ్)
ఎంపీటీసీ రిటర్నింగ్ ఆఫీసర్లు 70+ (14 రిజర్వ్)
జోనల్ ఆఫీసర్లు 70+ (14 రిజర్వ్)