
మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి
జగిత్యాల: మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించి పక్షం రోజులపాటు నారి స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తోందని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. బుధవారం మాతాశిశు సంక్షేమ కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లాలోని అన్ని ఆరోగ్య కేంద్రాల్లో కార్యక్రమం నిర్వహిస్తారని, వైద్యులు మంచి చికిత్స అందిస్తారని తెలిపారు. కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ.. మహిళలకు వచ్చే వివిధ రకాల హైపర్‌టెన్షన్స్, డయాబెటిస్, సర్వైకల్ క్యాన్సర్, బ్రెస్ట్‌క్యాన్సర్, అనేమియా వంటి వాటిని గుర్తించి చికిత్స అందించనున్నట్లు పేర్కొన్నారు. మహిళలు ఎలాంటి ఆరోగ్య సమస్యలున్నా సమీప ఆరోగ్య కేంద్రంలో పరీక్షించుకోవాలన్నారు. డీఎంహెచ్‌వో ప్రమోద్‌కుమార్, మాతాశిశు సంక్షేమ కేంద్రం సూపరింటెండెంట్ కృష్ణమూర్తి, డీడబ్ల్యూవో నరేశ్ పాల్గొన్నారు.