
రేపటి నుంచి పోషణ మహోత్సవం
జగిత్యాల: చిన్నారులు, మహిళలకు పోషకాహారంపై అవగాహన కల్పించేందుకు ఈనెల 17 నుంచి అక్టోబర్ 16 వరకు పోషణ మహోత్సవం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు. సోమవారం అన్ని శాఖల అధికారులతో సమీక్షించారు. జంక్‌ఫుడ్ వినియోగాన్ని తగ్గించడంతోపాటు, చక్కెర, ఉప్పు, నూనె వాడకం పరిమితంగా వాడాలని సూచించారు. ప్రతి ఐసీడీఎస్ ప్రాజెక్ట్‌కు రూ.30వేల నుంచి రూ.50వేల చొప్పున నిధులు విడుదల చేసినట్లు తెలిపారు. అదనపు కలెక్టర్ రాజాగౌడ్, సంక్షేమాధికారి నరేశ్, గ్రామీణాభివృద్ధి అధికారి రఘువరణ్, డీఎంహెచ్‌వో ప్రమోద్‌కుమార్ పాల్గొన్నారు.
ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాం
జగిత్యాల: స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ నిర్వహణకు అధికారులు ససిద్దంగా ఉండాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి అన్నారు. కలెక్టర్లతో సోమవారం కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎస్‌ఐఆర్ నిర్వహణపై మాస్టర్ ట్రైనర్ల ద్వారా బూత్‌స్థాయి సిబ్బందికి అవగాహన కల్పించాలన్నారు. ప్రతి పోలింగ్ బూత్‌స్థాయిలో 2002 ఎస్‌ఐఆర్ డేటా.. 2025డేటాతో సరిచూసుకోవాలన్నారు. రిటర్నింగ్ అధికారులు ఏఈఆర్వో, డిప్యూటీ తహసీల్దార్లతో నిత్యం సమావేశం కావాలన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామన్నారు.