
పోలీస్ గ్రీవెన్స్‌కు 12 దరఖాస్తులు
జగిత్యాలక్రైం: బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడుతున్నామని ఎస్పీ అశోక్‌కుమార్ అన్నారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో గ్రీవెన్స్ నిర్వహించారు. వివిధ ప్రాంతాలకు చెందిన 12 మంది వారివారి సమస్యలపై దరఖాస్తు చేసుకోగా.. వారితో నేరుగా మాట్లాడారు. పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. పోలీస్ శాఖను ప్రజలకు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు వివరించారు.
హక్కుల సాధనకు ఉద్యమించాలి
కోరుట్లటౌన్: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో అమరులైన యోధుల స్ఫూర్తితో హక్కుల సాధనకు ఉద్యమించాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు సుతారి రాములు అన్నారు. స్థానిక సినారే కళాభవన్, మున్సిపల్ కార్యాలయం వద్ద అంగన్‌వాడీ టీచర్స్, హెల్పర్స్, మున్సిపల్ కార్మికులతో సోమవారం సమావేశమయ్యారు. సాయుధ పోరాటంలో అమరులకు నివాళులర్పించారు. అంగన్‌వాడీ టీచర్స్, హెల్పర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు ఎం.సాయీశ్వరి, ప్రధాన కార్యదర్శి నండూరి కర్ణకుమారి, సుమలత, పద్మ, గంగమణి, హిమగిరి తదితరులు పాల్గొన్నారు.
ఎస్సారెస్పీ
22 గేట్ల ఎత్తివేత
జగిత్యాలఅగ్రికల్చర్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి 1.28లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండటంతో 22 గేట్లు ఎత్తి 89,860 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. వరదకాలువకు ఎనిమిది వేల క్యూసెక్కులు, కాకతీయ కాలువకు నాలుగు వేలు, ఎస్కేప్ గేట్ల ద్వారా ఐదు వేలు, సరస్వతి కెనాల్‌కు 800, లక్ష్మి కెనాల్‌కు 200, అలీసాగర్ ఎత్తిపోతలకు 180, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తున్నారు.
విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి
జగిత్యాలటౌన్: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు యాదగిరి బా బు డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా నాయకులు, కార్యకర్తలతో పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. అప్పటి కేంద్ర హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ సైనిక చర్యతో 1948లో తెలంగాణకు విముక్తి లభించందని గుర్తు చేశారు. దశరథరె డ్డి, భూ మి రమణకుమార్, వడ్డెపెల్లి శ్రీనివాస్, జుంబర్తి దివాకర్, కొక్కు గంగాధర్ పాల్గొన్నారు.
దైవభక్తుడికి స్వాగతం
కొడిమ్యాల: మండలకేంద్రానికి చెందిన వెలమ నర్సింహారెడ్డి సైకిల్‌పై 108 పుణ్యక్షేత్రాలను దాదాపు 22వేల కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణం పూర్తి చేసుకుని స్వగ్రామానికి చేరుకున్నారు. ఆయనకు శ్రీవేంకటేశ్వర స్వామి ఆ లయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు స్వాగతం పలికారు. ఆలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడ నర్సింహారెడ్డిని ఘనంగా సన్మానించారు.

పోలీస్ గ్రీవెన్స్‌కు 12 దరఖాస్తులు

పోలీస్ గ్రీవెన్స్‌కు 12 దరఖాస్తులు

పోలీస్ గ్రీవెన్స్‌కు 12 దరఖాస్తులు