
పెట్రోల్ బాటిళ్లతో ప్రజావాణికి..
● అడ్డుకున్న పోలీసులు
చెరువులపై ఆధారపడి జీవించే తమకు వాటిపై హక్కులు కల్పించాలని డిమాండ్ చేస్తూ మెట్‌పల్లి మండలం కోనరావుపేటకు చెందిన గంగపుత్రులు ప్రజావాణికి పెట్రోల్ బాటిళ్లతో వచ్చారు. పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. కొండ్రికర్ల చెరువుపై ముదిరాజ్‌లు ఆధిపత్యం చలాయిస్తున్నారని, కొన్నేళ్ల క్రితం 44ఎకరాలుగా గుర్తించిన చెరువు విస్తీర్ణాన్ని 2023లో తమ సొసైటీకి సమాచారం ఇవ్వకుండానే రీసర్వే చేసి 92ఎకరాలు ఉన్నట్లు తప్పుగా చూపించారని ఆరోపించారు. రాజకీయ ఒత్తిళ్లతో ముదిరాజులకు సభ్యత్వాలు ఇస్తున్నారని తెలిపారు. పట్టణ సీఐ కరుణాకర్ సముదాయించి అక్కడి నుంచి పంపించివేశారు.