
బీఆర్‌ఎస్ వారినే తొలగించారు
బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన సొసైటీ చైర్మన్, పాలకవర్గాలను మాత్రమే తొలగించారు. అన్ని సొసైటీల్లో చిన్నచిన్న అవకతవకలు ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ చైర్మన్లు ఉన్న సొసైటీల్లో ఏ చిన్న అవకతవకలు జరగలేదా..? అధికార పార్టీ నాయకులకు తలొగ్గే అధికారులు ఇదంతా చేస్తున్నారు.
– శ్రీకాంత్‌రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్
సొసైటీల నిర్వహణ సరిగా లేకనే
రాష్ట్ర సహకారశాఖ ఆదేశాలు అమలు చేశాం. నిర్వహణ సరిగ్గా లేని సొసైటీ పాలకవర్గాలను పొడిగించవద్దంటూ ప్రభుత్వ ఆదేశాలున్నాయి. ఆ మేరకు రద్దయిన ఆయా సొసైటీలకు పర్సన్ ఇన్‌చార్జిలను నియమించాం. మాపై ఏ పార్టీ ఒత్తిడి లేదు. ఎవరి ఒత్తిళ్లకూ తలొగ్గం.
– సీహెచ్.మనోజ్‌కుమార్, జిల్లా సహాకారశాఖాధికారి

బీఆర్‌ఎస్ వారినే తొలగించారు