
ఆసరా పింఛన్లు పెంచేవరకూ ఆందోళన
జగిత్యాలరూరల్: ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు ఆసరా పింఛన్లు పెంచాలని, లేకుంటే ఆందోళన చేస్తామని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు దుమాల గంగారాం అన్నారు. జగిత్యాల అర్బన్, రూరల్ తహసీల్దార్ కార్యాలయాల ముందు ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ అధికారంలోకొస్తే పింఛన్‌ను రూ.4వేలకు పెంచుతామని 22 నెలలు గడిచినా ఇప్పటివరకు అమలు చేయడంలేదన్నారు. వీఎస్‌పీఎస్ జిల్లా కార్యదర్శి గౌరిశెట్టి చంద్రశేఖర్, ఎంఎస్‌సీ జిల్లా ఉపాధ్యక్షుడు బోనగిరి కిషన్, ఎమ్మార్పీఎస్ నాయకులు బొల్లారపు దివాకర్, నక్క సతీశ్, సుధాకర్, సునిల్, గంగు, లక్ష్మీ, శ్రావణి పాల్గొన్నారు.