
సమస్యలుంటే దృష్టికి తీసుకురండి
జగిత్యాల: పాఠశాలల్లో ఏదైనా సమస్యలుంటే తన దృష్టికి తేవాలని, ప్రభుత్వం, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని మైనార్టీ గురుకుల బాలుర పాఠశాలను మంగళవారం తనిఖీ చేశారు. విద్యార్థులకు అందించే భోజనం విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదని, మెనూ ప్రకారం అందించాలని, ఇబ్బందులకు గురిచేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంప్లెక్స్ జిల్లాకు మంజూ రు చేసుకోవడం జరిగిందన్నారు. మాజీ ము న్సిపల్ చైర్మన్లు గిరి నాగభూషషణం, జ్యోతి, అబ్దుల్ ఖాదర్, ముజాహిద్ పాల్గొన్నారు.
మహిళ ఆరోగ్యంతోనే శక్తివంతమైన కుటుంబం
జగిత్యాల: కుటుంబంలోని మహిళ ఆరోగ్యంతోనే శక్తివంతమైన జీవితం సాధ్యమవుతుంద ని, కుటుంబం ఆనందంగా ఉంటుందని డీఎంహెచ్‌వో ప్రమోద్‌కుమార్ తెలిపారు. మంగళవారం డీఎంహెచ్‌వో కార్యాలయంలో వివిధవిభాగాల అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఈనెల 17వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు ఆరోగ్య మహిళ శక్తివంతమైన కుటుంబం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి మోదీ మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో వర్చువల్‌గా ప్రారంభిస్తారని, జగిత్యాలలో ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ చేతుల మీదుగా ప్రారంభిస్తారన్నారు. మహిళ ఆరోగ్యం కోసం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి, కమ్యునిటీ హెల్త్‌సెంటర్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో స్పెషలిస్ట్ వైద్య నిపుణులతో శిబిరాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. డీఆర్డీఏ పీడీ రఘువరణ్, డీఈవో రాము పాల్గొన్నారు.
ఉపాధ్యాయుడి డిప్యూటేషన్ రద్దు చేయాలి
కథలాపూర్: కథలాపూర్ ఎంఈవో కార్యాలయం ఎదుట మండలంలోని పోసానిపేట ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు మంగళవారం నిరసన వ్యక్తం చేశారు. పాఠశాలలో పనిచేస్తున్న కరుణాకర్ అనే ఉపాధ్యాయుడిని ఇతర పాఠశాలకు డిప్యూటేషన్ వేయడం సరికాదన్నారు. పాఠశాలలో 128 మంది విద్యార్థులు, ఎనిమిది మంది ఉపాధ్యాయులు ఉన్నారన్నారు. ఒకరు వచ్చేనెలలో ఉద్యోగవిరమణ పొందుతున్నారని, ఒక ఉపాధ్యాయుడిని డిప్యూటేషన్‌పై పంపిస్తే కొరత ఏర్పడుతుందన్నారు. ఉన్నతాధికారులు చొరవ చూపి డిప్యూటేషన్ రద్దు చేయాలని ఎంఈవో శ్రీనివాస్‌కు వినతిపత్రం ఇచ్చారు. కాగా.. నిబ ంధనల ప్రకారం ఉపాధ్యాయుల డిప్యూటేషన్ జరిగిందని ఎంఈవో శ్రీనివాస్ పేర్కొన్నారు.
ఆరోగ్య శిబిరాలు సద్వినియోగం చేసుకోవాలి
జగిత్యాల: విద్యార్థుల కోసం వైద్యశాఖ ఆధ్వర్యంలో స్వస్థ నారి స్వశక్తి పథకం కింద ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగిందని డీఈవో రాము తెలిపారరు. నేటి నుంచి ప్రారంభం కానున్న శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్క విద్యార్థి అన్ని రకాల పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు.
‘ఇంకెన్నాళ్లు విద్యార్థుల ఇక్కట్లు’
జగిత్యాల: విద్యార్థుల ఉద్యమాలతో తెలంగాణ సాధించుకున్నామని, ఇప్పుడు చదువు కోసం ఇక్కట్లు పడుతున్నారని మాజీ జెడ్పీచైర్‌పర్సన్ వసంత అన్నారు. మంగళవారం మాట్లాడుతూ విద్యార్థుల విషయంలో ప్రభుత్వం వివక్ష, నిర్లక్ష్యం చూపడం సమంజసం కాదన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో నిరుపేద విద్యార్థులకు ఉన్నత విద్య అందని ద్రాక్షగా మారిందన్నారు. ఇప్పటి వరకు పెండింగ్‌లో ఉన్న రీయింబర్స్‌మెంట్, ఎంపీఎఫ్ బకాయిలు వెంటనే చెల్లించాలన్నారు.

సమస్యలుంటే దృష్టికి తీసుకురండి

సమస్యలుంటే దృష్టికి తీసుకురండి