Shocking Video: Youtuber Mr. Beast Spends 50 Hours Alive In Coffin - Sakshi
Sakshi News home page

సాహసం‌: 50 గంటలు సజీవ సమాధి!

Apr 2 2021 4:56 PM | Updated on Apr 2 2021 8:37 PM

Viral Video: YouTuber Spends 50 Hours Buried Alive In Coffin - Sakshi

మిస్టర్‌ బీస్ట్‌.. అసలు పేరు జిమ్మీ డొనాల్డ్‌సన్.‌ భయాన్ని సైతం జయించాలనే తాపత్రయం కలవాడు. ప్రమాదాలతో పరాచికాలు ఆడుతుంటాడు. దీన్ని వీడియోలు తీసి తన యూట్యూబ్‌ ఛానల్‌లో అప్‌లోడ్‌ చేస్తుంటాడు. ఫాలోవర్లను ఎంటర్‌టైన్‌ చేసేందుకు ఏదైనా చేస్తుంటాడు. తాజాగా అతడు సజీవ సమాధికి పూనుకున్నాడు. ఒకటీ రెండు గంటలు కాదు, ఏకంగా 50 గంటలు శవపేటికలో పడుకున్నాడు. అంటే రెండు రోజులకు పైగా భూమి లోపల పేటికలో జీవించాడు.

దీన్నంతటినీ 12 నిమిషాల వీడియోగా ఎడిట్‌ చేసి యూట్యూబ్‌లో షేర్‌ చేశాడు. ఇంకేముందీ అతడు చేసిన ప్రమాదకరమైన పని గురించి, అతడి గురించి సోషల్‌ మీడియాలో విపరీతమైన చర్చ నడుస్తోంది. ఇక ఈ వీడియోలో పేటికలో పడుకున్న అతడు బోర్‌గా ఫీల్‌ అయినట్లు పేర్కొన్నాడు. కొన్నిసార్లు కదలడానికి కూడా ఇబ్బంది పడినట్లు చెప్పుకొచ్చాడు. అయితే సమాధిలోకి వెళ్లేముందు పలు జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపాడు.

మొత్తానికి ఓ పెద్ద స్టంట్‌ చేసి ప్రాణాలతో శవపేటిక నుంచి బయటపడిన ఇతడు తన అనుభవం గురించి మాట్లాడుతూ ఇది నిజంగా వెర్రిచేష్టలే అని తనను తానే నిందించుకున్నాడు. ఇలా సమాధిలోకి వెళ్లినప్పుడు తలనొప్పితో బాధపడటమే కాక ఆకలితో అలమటించానని పేర్కొన్నాడు. ఇప్పటివరకు తాను చేసిన సంట్స్‌లో మరీ అధ్వాన్నమైన పని ఇదే అని చెప్పుకొచ్చాడు. పలువురు నెటిజన్లు కూడా అతడి సాహసాన్ని విమర్శిస్తున్నారు. దీనివల్ల మానసికంగా బాధ కలగడంతో పాటు శారీరక సమస్యలు కూడా వస్తాయని చెప్తున్నారు. కొద్ది మంది నెటిజన్లు మాత్రం ఇంతటి సాహసానికి పూనుకోవడం నిజంగా గ్రేట్‌ అని కొనియాడుతున్నారు.

చదవండి: వాట్సాప్‌ మెసేజ్‌: సిటీలో హెల్మెట్‌ అవసరం లేదా?

పాపం ఈ భల్లూకం కష్టం చూడండి.. పిల్లల కోసం..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement