పాక్‌లో అమెరికా-ఇరాన్‌ మళ్లీ చర్చలు..! ఎప్పుడంటే? | US, Iranian teams could return to Islamabad for peace talks | Sakshi
Sakshi News home page

పాక్‌లో అమెరికా-ఇరాన్‌ మళ్లీ చర్చలు..! ఎప్పుడంటే?

Apr 14 2026 5:51 PM | Updated on Apr 14 2026 5:58 PM

US, Iranian teams could return to Islamabad for peace talks

వాషింగ్టన్‌: పశ్చిమాసియాలో శాంతి గురించి చర్చించడానికి అమెరికా, ఇరాన్ ప‍్రతినిధులు ఈ వారం చివరలో పాకిస్థాన్‌ రాజధాని ఇస్లామాబాద్‌కు మళ్లీ రావచ్చని అంతర్జాతీయ మీడియా పేర్కొంటోంది. ఇటీవల ఇస్లామాబాద్‌లో జరిగిన చర్చలు విఫలమైన విషయం తెలిసిందే. 

దీంతో రెండో దశ చర్చలు జరపాలని అమెరికా-ఇరాన్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది. తేదీని ఇంకా నిర్ణయించలేదని, కానీ ఈ వారం చివరలోనే అమెరికా-ఇరాన్‌ తిరిగి ఇస్లామాబాద్‌ రావచ్చని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఇరు దేశాల ప్రతినిధి బృందాలు శుక్ర/శని/ఆదివారం చర్చల్లో పాల్గొనవచ్చని ఒక సీనియర్ ఇరాన్ అధికారి అన్నారు.

అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న ఘర్షణకు పరిష్కారం కోసం చర‍్చల ప్రతిపాదనలు వస్తున్నాయి. ఇటీవల ఇరు దేశాల అధికారులు సమావేశమయ్యారు. దశాబ్దానికి పైగా కాలంలో అమెరికా, ఇరాన్ అధికారుల మధ్య జరిగిన తొలి ప్రత్యక్ష భేటీ ఇది. అలాగే 1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత జరిగిన అత్యున్నత స్థాయి సంప్రదింపులు ఇవే.

పాకిస్థాన్‌లోని సోర్స్‌ తెలిపిన వివరాల ప్రకారం.. తదుపరి దశ చర్చల గురించి అమెరికా-ఇరాన్‌తో పాక్‌ ప్రతినిధులు మాట్లాడుతు‍న్నారు. “మేము ఇరాన్‌తో మాట్లాడాము. రెండో దశ చర్చలకు వారు సిద్ధంగా ఉన్నారని తెలిపేలా సానుకూల స్పందన వచ్చింది” అని పాకిస్థాన్ ప్రభుత్వ సీనియర్ అధికారి తెలిపారు.

పాకిస్థాన్‌లో ఇటీవల జరిగిన చర్చలకు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌, ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్‌ మొహమ్మద్ బాగేర్ ఖలీబాఫ్ తమ తమ బృందాలకు నాయకత్వం వహించారు. హార‍్మూజ్ జలసంధి, ఇరాన్ అణు కార్యక్రమం, అంతర్జాతీయ ఆంక్షలు వంటి అంశాలు చర్చలకు అడ్డంకిగా మారాయి.

 

Advertisement
 
Advertisement
Advertisement