సైలెంట్‌గా వస్తాయి.. స్థావరాన్ని లేపేస్తాయి.. రష్యాకు వణుకే | ukraine key weapon has wheels a bomb it killing thousands of russian | Sakshi
Sakshi News home page

సైలెంట్‌గా వస్తాయి.. స్థావరాన్ని లేపేస్తాయి.. రష్యాకు వణుకే

May 31 2026 12:55 AM | Updated on May 31 2026 1:37 AM

ukraine key weapon has wheels a bomb it killing thousands of russian

కీవ్‌: రష్యాను కదనరంగంలో దెబ్బగొట్టడానికి ఉక్రెయిన్ సరికొత్త ప్రణాళికను అనుసరిస్తోంది. సాంకేతికను వాడి భారీగా రోబోలు, డ్రోన్లు వంటి ఆధునాతన పరికరాలను వాడి శత్రువును తీరని దెబ్బకొడుతోంది.  ఏమాత్రం శబ్ధం చేయకుండా  రోబోటిక్  వాహనాలు  శత్రుస్థావరాలకు  చేరుకొని వారు తేరుకునేలోపే కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి.

ఉక్రెయిన్ యుద్ధంలో సాంకేతికను  పెద్దఎత్తున వాడుకుంటుంది. ఒకప్పుడు స్వయంగా యుద్ధరంగంలోకి దూకి శత్రువులతో పోరాడి తమ ప్రాణాలు అర్పించిన ఉక్రెయిన్ కమాండర్లు  ఇప్పుడు ఫ్రంట్‌లైన్‌కు దూరంగా సురక్షిత ప్రాంతాల్లో కూర్చొని స్క్రీన్లు, లైవ్‌స్ట్రీమ్‌లు, డ్రోన్ల సహాయంతో దాడులను పర్యవేక్షిస్తున్నారు. ఉక్రెయిన్ సైనికులు ఎవరూ నేరుగా రంగంలోకి దిగకుండానే, కేవలం పేలుడు పదార్థాలతో కూడిన రోబోల సహాయంతో రష్యా స్థావరాలను విజయవంతంగా ముట్టడిస్తున్నారు.  రోబోటిక్ వాహనాలతో రష్యన్ల  గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నారు.

ఈ రోబోటిక్ బాంబు వాహనాలకు రష్యా సైనికులు "సైలెంట్ డెత్" (నిశ్శబ్ద మరణం) అని పేరు పెట్టుకున్నట్లు పట్టుబడిన రష్యా ఖైదీలు వెల్లడించారు. ఇవి ఎంత నిశ్శబ్దంగా ప్రయాణిస్తాయంటే, కేవలం 10 మీటర్ల దూరంలోకి వచ్చేంత వరకు రష్యా సైనికులు వీటిని గుర్తించలేకపోతున్నారు. అప్పటికే అవి పేలుడు పరిధిలోకి రావడంతో జరగాల్సిన నష్టం జరుగుతుంది.

నాలుగేళ్లకు పైగా సాగుతున్న ఈ యుద్ధంలో ఉక్రెయిన్ ఇప్పటికే భారీగా సైనికులను కోల్పోయింది. జనాభా పరంగా రష్యా కంటే చిన్న దేశం కావడంతో సైనికుల కొరతను అధిగమించడానికి ఉక్రెయిన్ ఈ రోబోటిక్ వ్యవస్థను ఎంచుకుంది. అదేవిధంగా అమెరికా ఇతర పాశ్చాత్య దేశాల నుండి అందుతున్న సైనిక సహాయంపై స్పష్టత లేకపోవడంతో, ఉక్రెయిన్ సొంతంగా డ్రోన్ల ఉత్పత్తిని, రోబోల సామర్థ్యాన్ని పెంచుకోవడంపై దృష్టి పెట్టింది.ఈ యుద్ధంలో సాంకేతికతను పెంచడం ద్వారా నెలకు సుమారు 35,000 మంది రష్యా సైనికులను హతమార్చడం లేదా గాయపరచడం ఉక్రెయిన్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఉక్రెయిన్ ప్రకటించింది.

కాగా, బ్రిటన్ నిఘా సంస్థ 'GCHQ' అంచనా ప్రకారం, ఈ యుద్ధంలో ఇప్పటివరకు దాదాపు 5 లక్షల మంది రష్యా సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు నివేదిక తెలిపింది. అదే విధంగా రోబోల వాడకంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఇదివరకే స్పష్టతనిచ్చారు. చరిత్రలోనే మొదటిసారిగా కేవలం డ్రోన్లు, రోబోల సహాయంతో ఒక రష్యా స్థావరాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నామని ప్రకటించారు. 

అయితే ప్రస్తుతం ఉక్రెయిన్ సరిహద్దుల్లో ఈ రోబోలను కేవలం దాడులకే కాకుండా, గాయపడిన సైనికులను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ఫ్రంట్‌లైన్ సైనికులకు ఆహారం, మందులు, ఆయుధాలను సరఫరా చేయడానికి కూడా విస్తృతంగా ఉపయోగిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement