ఆరేళ్లుగా తన మూత్రాన్ని తానే తాగుతున్న వ్యక్తి.. 10 ఏళ్లు యవ్వనంగా..

UK Man Claims Drinking Urine Daily Made Him Look 10 Years Younger - Sakshi

ప్రపంచంలో ఒక్కొక్కరికి ఒక్కో అలవాటు ఉంటుంది. చాలా మంది నిత్యం అందంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు. ఇందుకు చాలామంది ఆహార నియమాలు పాటిస్తారు. వ్యాయామం, యోగా, డైట్‌ తీసుకోవడం వల్ల కూడా ఆరోగ్యంగా ఉండేందుకు దోహదపడుతుంది. కానీ ఓ వ్యక్తి చాలా విచిత్రంగా మూత్రం(యూరిన్‌) తాగడం వల్ల తన వయసు తగ్గి యవ్వనంగా కనిపిస్తున్నట్లు చెబుతున్నాడు. మానసిక ఒత్తిడిని సైతం జయించినట్లు పేర్కొన్నాడు. అతనే ఇంగ్లాండ్‌కు చెందిన 34 ఏళ్ల  హ్యారీ మెటాడీన్.. 

యూకేలోని హాంప్‌షైర్‌కు చెందిన హ్యారీ 2016 నుంచి ఇప్పటి వరకు రోజూ తన మూత్రాన్ని తానే తాగుతున్నాడు. ఇలా చేయడం వల్ల దాదాపు 10 ఏళ్లు యంగ్‌గా కనిపిస్తున్నట్లు పేర్కొన్నాడు. గతంలో తనకు మానసిక సమస్యలను ఎదురవ్వగా వాటి నుంచి బయట పడేందుకు ఈ ’యూరిన్‌ థెరపీ’ ప్రారంభించినట్లు తెలిపాడు. దీంతో తనకు శాంతి, ప్రశాంతత వంటి కొత్త అనుభూతిని ఇచ్చిందని వెల్లడించాడు. అప్పటి నుంచి సొంత మూత్రాన్ని తాగుతున్నట్లు చెప్పాడు. 

తన మూత్రాన్ని బాటిల్స్‌లో స్టోర్ చేసుకొని.. రోజుకో 200 మి. లీ చొప్పున తాగుతుంటాడు.  మూత్రాన్ని బాటిల్స్‌లో నింపి.. రెండు మూడు నెలల తర్వాత తాగుతున్నట్లు తెలిపాడు. దీనిని తాగినప్పుడు ఎంతో శక్తివంతంగా ఉంటుందని, ఒత్తిడి దూరమై, మెదడు చురుకుగా పనిచేస్తుందని హ్యరీ తెలిపాడు. అలాగే మూత్రాన్ని మాయిశ్చరైజర్‌గా తన ముఖానికి మసాజ్ చేస్తానని కూడా వెల్లడించాడు. ఇలా చేయడం వల్ల తన చర్మం యవ్వనంగా, మృదువుగా, మెరుస్తూ కనిపిస్తుందంటున్నాడు. ఇక 90 శాతం నీరు ఉన్న మూత్రానికి శరీరంలో ఉన్న అన్ని రోగాలను నయం చేసే శక్తి ఉందని హ్యారీ విశ్వసిస్తున్నాడు.
చదవండి: Pakistan: ఇమ్రాన్‌ఖాన్‌కు మరో బిగ్‌ షాక్‌

మూత్రం తాగడం వల్ల తనకు ఎంతో మేలు జరిగిందని.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ అలవాటును మార్చుకోనని చెబుతున్నాడు. దీనిని తయారు చేసేందుకు ఖర్చుకూడా లేకపోవడంతోపాటు నిత్య మూత్రం తాగడం వల్ల శరీరంలో అనూహ్య మార్పులు వచ్చాయని చెప్పారు. కాగా గతంలో సింగర్స్‌ మడోన్నా, కేషా కూడా మూత్రం తాగుతామని వెల్లడించారు. అయితే ఈ నిర్ణయాన్ని వైద్యులు వ్యతిరేకిస్తున్నారు. మూత్రం తాగడం వల్ల శరీరంలో  డీహైడ్రేషన్ పెరుగుతుందని.. బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్లు వస్తాయని హెచ్చరిస్తున్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top