పారిస్‌లో కాల్పుల కలకలం..ఇద్దరు మృతి

పారిస్‌లో కాల్పుల కలకలం చోటు చేసుకుంది. ఈ ఘటనలో అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందగా, నలుగురికి పైగా తీవ్రంగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటన సెంట్రల్ పారిస్‌లోని కుర్దిష్ సాంస్కృతిక కేంద్రం పరిసరాల వద్ద శుక్రవారం మధ్యాహ్నం జరిగిందని పారిస్ పోలీసులు చెబుతున్నారు.
నిందితుడు 60 ఏళ్ల షుటర్‌ని అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు తెలిపారు. ఒక దుకాణదారురాలు తాను సుమారు ఏడు నుంచి ఎనిమిది దాక కాల్పుల షాట్‌లు విన్నానని, భయంతో లోపల లాక్ చేసుకుని ఉండిపోయినట్లు పోలీసులుకు తెలిపింది. ఈ ఘటన జరిగిన వెంటనే అప్రమత్తమై నిందితుడి పట్టుకున్నందుకు భద్రతా దళాలకు డిప్యూటీ మేయర్ ఇమ్మాన్యుయేల్ గ్రెగోయిర్ ట్వీట్టర్‌లో ధన్యవాదాలు తెలిపారు.
ALERTE - Fusillade à Paris : plusieurs blessés dans le 10eme arrondissement.
Police sur place. Un suspect interpelé. pic.twitter.com/mbQFl2a0vf
— Clément Lanot (@ClementLanot) December 23, 2022
(చదవండి: ఘోరంగా పెరుగుతున్న కేసులు..వైద్యం అందించలేక కుప్పకూలిన డాక్టర్)
మరిన్ని వార్తలు :
మరిన్ని వార్తలు