యుద్ధంపై ట్రంప్ అంతరంగికం ఇదే.. జేడీ వాన్స్‌ | This is Trump's inner view on war JD Vance | Sakshi
Sakshi News home page

యుద్ధంపై ట్రంప్ అంతరంగికం ఇదే.. జేడీ వాన్స్‌

Apr 8 2026 6:57 PM | Updated on Apr 8 2026 7:50 PM

This is Trump's inner view on war  JD Vance

ప్రస్తుతం అమెరికా- ఇరాన్ మధ్య 14రోజుల సీజ్‌ఫైర్‌ నడుస్తోంది. రెండు వారాల తర్వాత ఇరు దేశాలు యుద్ధం ముగింపుకు అంగీకరిస్తాయా? లేదా అన్న సంగతి తెలియదు. అయితే ఇరాన్‌తో యుద్ధం విషయంలో ట్రంప్ అంతరంగికం గురించి అమెరికా ఉపాధ్యక్షుడు జేడీవాన్స్‌ మాట్లాడారు. డొనాల్డ్ ట్రంప్ ఈ విషయంలో తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలిపారు.

ప్రస్తుతం హంగేరి పర్యటనలో ఉన్న జేడీవాన్స్‌ యుద్ధంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌తో చర్చలు జరపడానికి తమ బృందానికి పలు కీలక విషయాలు ట్రంప్ వెల్లడించారన్నారు ఇరాన్‌తో చర్చలు జరిపేటప్పుడు పూర్తి పారదర్శకతతో, నిజాయితీతో వ్యవహరించాలని చర్చలు జరిపే బృందానికి స్పష్టమైన ఆదేశాలిచ్చారని తెలిపారు. అయితే ఇరాన్‌తో ఒప్పందం కుదుర్చుకోవడంలో ట్రంప్ చాలా అసహనంగా ఉన్నారని త్వరగా ఫలితాలు రావాలని కోరుకుంటున్నారని తెలిపారు.

అయితే ఇరాన్ పాలకవర్గంలో  కొన్ని విభాగాలు చర్చలకు సహకరిస్తున్నప్పటికీ, మరికొన్ని విభాగాలు నిర్మాణాత్మకంగా వ్యవహరించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒకవేళ ఇరాన్ చిత్తశుద్ధితో చర్చలకు వస్తే ఖచ్చితంగా ఒక ఒప్పందానికి రావచ్చని  అదంతా ఇరాన్ చేతిలోనే ఉంటుందని పేర్కొన్నారు.

గత ఆరు వారాలుగా అమెరికా-ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం వల్ల వేలమంది ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచ ఇంధన సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. నిన్న ఇరాన్‌ నాగరికతను అంతం చేస్తాం అని ట్రంప్ తీవ్ర హెచ్చరికలు చేశారు. అనంతరం కొద్ది సేపటికే 14 రోజుల సీజ్‌ఫైర్‌  ఒప్పందం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య చర్చలు ఈ మేరకు ఫలిస్తాయో చూడాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement