ఇరాన్‌కు మద్దతిస్తున్న దేశాలకు ట్రంప్ వార్నింగ్‌! | Trump threatens China with 50% tariffs if it supplies weapons to Iran | Sakshi
Sakshi News home page

పశ్చిమాసియా యుద్ధం.. ఇరాన్‌కు మద్దతిస్తున్న దేశాలకు ట్రంప్ వార్నింగ్‌!

Apr 13 2026 3:42 PM | Updated on Apr 13 2026 4:03 PM

Trump threatens China with 50% tariffs if it supplies weapons to Iran

వాషింగ్టన్‌: పశ్చిమాసియా యుద్ధంలో ఇరాన్‌కు మద్దతుగా నిలుస్తున్న దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇరాన్‌కు అయుధ సాయం చేస్తే 50 లేదా అంతకంటే ఎక్కువ మొత్తంలో టారిఫ్‌ విధిస్తామని హెచ్చరికలు జారీ చేశారు. 

త్వరలో ఇరాన్‌కు చైనా పెద్దమొత్తంలో ఆయుధ సాయం చేయనుందంటూ పలు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. చైనా అందించే క్షిపణులతో ఇరాన్‌ తన శత్రు దేశాల విమానాలను కూల్చేందుకు, ట్యాంకులను ధ్వంసం చేసేందుకు ఉపయోగించనుందని కథనాలు హైలెట్‌ చేశాయి.

ఈ క్రమంలో ఫాక్స్‌ న్యూస్‌ రిపోర్టర్‌ మరియా సారా బార్టిరోమోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పత్రికా కథనాలపై ట్రంప్‌ స్పందించారు. ఇరాన్‌కు ఆయుధ సాయం చేసే దేశాల జాబితాలో చైనా ఉంటే ఎలాంటి చర్యలు తీసుకుంటారని రిపోర్టర్‌ మరియా ట్రంప్‌ను ప్రశ్నించారు. 

అందుకు ట్రంప్‌ మాట్లాడుతూ.. ఇరాన్‌కు ఆయుధ చేసే దేశాలపై అమెరికా కఠిన ఆంక్షలు విధిస్తుంది. చైనా-ఇరాన​ ఆయుధ ఒప్పందంపై వెలుగులోకి వచ్చిన మీడియా కథనాల్లో వాస్తవం ఉండకపోవచ్చు. వాటిని నేను పెద్దగా పట్టించుకోను. అదే నిజమైతే చైనాతో పాటు ఇతర దేశాలపై 50 అంతకంటే ఎక్కువ శాతం సుంకం విధిస్తాం. మీరన్నట్లు ఇరాన్‌కు చైనా ఆయుధ సాయం చేసే సాహసం చేయకపోవచ్చు. ఎందుకంటే చైనాకు మాకు మంచి సన్నిహిత సంబంధాలున్నాయి. కాబట్టి వారు అలా చేస్తారని నేను అనుకోను. అలా చేయరు కూడా. బహుశా యుద్ధం ప్రారంభంలో తక్కువ మొత్తంలో పంపిస్తే.. పంపించి ఉండొచ్చు. కానీ ఇకపై అలా చేస్తారని నేను అనుకోను.  ఆయుధ సాయం చేస్తూ దొరికిపోతే వారిపై 50 శాతం సుంకం విధిస్తాం’ అని స్పష్టం చేశారు.

అనంతరం చైనా చమురు కొనుగోళ్ల కోసం అమెరికాకు, వెనుజువెలాకు షిప్పులు పంపుకోవచ్చు. వెనెజువెలా నుంచి చమురు కొనుక్కోమని మేమే చెప్పాం. మన దగ్గర అవసరానికి మించి ఉత్పత్తి సామర్థ్యం ఉంది. మేమే వారికి వెనెజువెలా అమ్మే ధరకంటే తక్కువ ధరకే అమ్ముతాము’అని ట్రంప్‌ అన్నారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement