వాషింగ్టన్, డీసీ: డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. తాను ఆరోగ్యంగా ఫర్‌ఫెక్ట్ ఉన్నానని ప్రకటించారు. తనకు వైద్య పరీక్షలు అద్భుతంగా జరిగాయని అందులో ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవన్నారు. త్వరలో డొనాల్డ్ ట్రంప్ తన 80వ పుట్టిన రోజు వేడుకలు జరుపుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్య పరిస్థితిపై అప్‌డేట్ ఇచ్చారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్య పరిస్థితిపై చాలానే పుకార్లు వచ్చాయి. ట్రంప్ ఆరోగ్యంగా లేరని వృద్ధాప్య సమస్యలు వెంటాడుతున్నాయని కథనాలు వచ్చాయి. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన చేతులపై కమిలిన గుర్తులు ఉండటం, సమావేశాలలో నిద్రపోతున్నట్లు కనిపించడం ఈ వాదనలకు మరింత బలం చేకూర్చింది. ఈ నేపథ్యంలో తన ఆరోగ్య పరిస్థితులపై ట్రంప్ కీలక ప్రకటన చేశారు
తన ట్రూత్ సోషల్ పోస్ట్‌లో " అంతా ఖచ్చితంగా ఉంది నేను 50 ఏళ్ల క్రితం ఎలా ఉన్నానో, ఇప్పుడూ అలాగే ఉన్నాను జంక్ ఫుడ్ ఆరోగ్యానికి మంచిదేమో" అని సరదాగా అన్నారు. జూన్ 14 నాటికి ట్రంప్ 80వ సంవత్సరంలోకి అడుగుపెడతారు. ట్రంప్ ఆరోగ్య పరీక్షలను వైట్ హౌస్ 'వార్షిక పరీక్ష' అని ప్రకటించినప్పటికీ, ట్రంప్ మాత్రం దీనిని 6 నెలల ఫిజికల్ టెస్ట్' అని పేర్కొనడం కొంత గందరగోళానికి దారితీసింది.
ట్రంప్ ఆరోగ్య సమస్యలు
ట్రంప్ 0 గతేడాది ట్రంప్ కాళ్ల వాపు సమస్యతో బాధపడుతున్నట్లు వైట్ హౌస్ వెల్లడించింది. సిరల్లోని కవాటాల లోపం వల్ల రక్తం చేరి ఇలా జరుగుతుందని వైద్యులు తెలిపారు. చేతులపై గుర్తులు: ఆయన చేతులపై కనిపించే మచ్చలకు, గుండె ఆరోగ్య నియమాలలో భాగంగా ఆయన తీసుకునే 'ఆస్పిరిన్'టాబ్లెట్లే కారణమని వైట్ హౌస్ స్పష్టం చేసింది.
రాజకీయ ప్రాధాన్యత
అమెరికా రాజకీయాల్లో అధ్యక్షుల వయస్సు అనేది పెద్ద చర్చనీయాంశంగా మారింది. 2024 ఎన్నికల సమయంలో 81 ఏళ్ల జో బైడెన్ వైదొలిగిన తర్వాత, ట్రంప్ అమెరికా చరిత్రలోనే అత్యంత వృద్ధుడైన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. తన ప్రత్యర్థుల కంటే తాను శారీరకంగా, మానసికంగా చాలా దృఢంగా ఉన్నానని ట్రంప్ తరచుగా అంటుంటారు.


