'అలా చేస్తే చైనాకు సమస్యలు వస్తాయి': ట్రంప్ హెచ్చరిక | Trump Praises US China Relations | Sakshi
Sakshi News home page

'అలా చేస్తే చైనాకు సమస్యలు వస్తాయి': ట్రంప్ హెచ్చరిక

Apr 14 2026 4:30 AM | Updated on Apr 14 2026 4:38 AM

Trump Praises US China Relations

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇటీవల చైనాతో తమకు ఉన్న సంబంధాలపై చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ రాజకీయాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. తాను చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో ప్రత్యక్షంగా మాట్లాడలేదని.. అయినప్పటికీ, అమెరికా - చైనా మధ్య చాలా మంచి సంబంధాలు కొనసాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.

వైట్ హౌస్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. పశ్చిమాసియా ఆసియా ప్రాంతంలో జరుగుతున్న యుద్ధ పరిస్థితులపై కూడా ట్రంప్ వ్యాఖ్యానించారు. ఆ ప్రాంతంలో ఉన్న ఉద్రిక్తతలు త్వరగా ముగియాలని షీ జిన్‌పింగ్ కోరుకుంటున్నారని ఆయన చెప్పారు. ఇది చైనా కూడా శాంతి స్థాపనకు ఆసక్తి చూపుతున్నదని సూచిస్తుంది.

చైనా ఇరాన్‌కు సైనిక సహాయం అందిస్తే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని ట్రంప్ హెచ్చరించారు. “అలా చేస్తే చైనాకు పెద్ద సమస్యలు వస్తాయి” అని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు అమెరికా-చైనా మధ్య ఎలాంటి సంబంధం ఉందో స్పష్టం చేస్తుంది.

ట్రూత్ సోషల్‌లో ఒక వివరణాత్మక పోస్ట్‌లో, ట్రంప్ సవరించిన షెడ్యూల్‌ను ధృవీకరించి, వాషింగ్టన్ - బీజింగ్ మధ్య పరస్పర దౌత్య సంబంధాల ప్రణాళికలను వివరించారు. "ఇరాన్‌లో మా సైనిక చర్య కారణంగా మొదట వాయిదా పడిన కారణంగా, జిన్‌పింగ్‌తో నా సమావేశం తిరిగి షెడ్యూల్ చేయడం జరిగిందని.. ఇది మే 14, 15 తేదీలలో బీజింగ్‌లో జరుగుతుందని అన్నారు''.

ఈ సందర్భంగా ఆయన తన భార్య మెలానియా ట్రంప్‌తో కలిసి చైనాకు వెళ్లనున్నారు. అలాగే భవిష్యత్తులో షీ జిన్‌పింగ్ దంపతులను అమెరికాలో ఆతిథ్యం ఇవ్వాలని కూడా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు. మధ్యప్రాచ్యంలో జరుగుతున్న సైనిక చర్యల కారణంగా ఈ సమావేశం ఆలస్యమైందని ఆమె తెలిపారు. ఈ పరిస్థితిని షీ జిన్‌పింగ్ అర్థం చేసుకున్నారని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement