భయపడి వెనక్కి తగ్గిన ట్రంప్‌ : ఇరాన్‌ కౌంటర్‌ | Trump has backed down as President pauses strikes says Iran | Sakshi
Sakshi News home page

భయపడి వెనక్కి తగ్గిన ట్రంప్‌ : ఇరాన్‌ కౌంటర్‌

Mar 23 2026 5:28 PM | Updated on Mar 23 2026 6:15 PM

Trump has backed down as President pauses strikes says Iran

ఇరాన్‌పై దాడులకు అయిదు రోజుల తాత్కాలిక విరామం ప్రకటించడంపై ఇరాన్‌ స్పందించింది. ఇంధన వసతులపై దాడులు, చర్చలు అంటూ ట్రంప్‌ ప్రకటనపై  ఇరాన్‌ సంచలన  సంచలన వ్యాఖ్యలు చేసింది.  ట్రంప్ తాజా పోస్ట్‌పై స్పందిస్తూ, ఇరాన్ ప్రతీకార చర్యలకు పాల్పడుతుందనే భయంతోనే ట్రంప్‌ వెనక్కి తగ్గారని ఇరాన్ ప్రభుత్వ మీడియా పేర్కొంది.

టెహ్రాన్ గట్టి హెచ్చరికల నేపథ్యంలోనే  ఇరాన్‌ ఇంధన మౌలిక సదుపాయాలపై దాడి చేసే ప్రణాళికల నుండి  డొనాల్డ్ ట్రంప్ వెనక్కి తగ్గారని కాబూల్‌లోని ఇరాన్ రాయబార కార్యాలయం తెలిపింది.మరోవైపు అసలు అమెరికా ఎలాంటి చర్చలు జరగలేదని  ఇరాన్‌ ప్రకటించడం గమనార్హం. ఇటీవలి అమెరికా-ఇరాన్ చర్చల అనంతరం, తమ విదేశాంగ మంత్రి ఇరాన్ విదేశాంగ మంత్రితో ఫోన్‌లో మాట్లాడారని, ఈ సందర్భంగా మారుతున్న ప్రాంతీయ పరిస్థితి మరియు సమన్వయంపై చర్చించారని రష్యా తెలిపింది.

మధ్యప్రాచ్యంలో మన శత్రుత్వానికి సంపూర్ణ పరిష్కారం కోసం గత రెండు రోజులుగా  అమెరికా, ఇరాన్ దేశం మధ్య చాలా మంచి, ఫలవంతమైన సంభాషణలు జరిగాయని, చర్చలు ముగిసేవారు దాడులుండవని ట్రూత్ సోషల్‌లో చేసిన ఒకపోస్ట్‌లో ట్రంప్ ప్రకటించారు. 

ఇదీ చదవండి: చమురు, గ్యాస్‌ సమస్యలపై ప్రధాని మోదీ కీలక హామీ

కాగా ఫిబ్రవరి 28న ఇరాన్‌పై, అమెరికా, ఇజ్రాయెల్‌ సంయుక్తంగా భీకర దాడులను  ప్రారంభించాయి. మిస్పైళ్లతో విరుచుకు పడింది. ఈ దాడుల్లో అప్పటి ఇరాన్‌  సుప్రీం అయతుల్లా ఖమేనీ, అతని కుటుంబంలో చాలామంది దుర్మరణం పాలయ్యారు. దీంతో ఇరాన్‌ తీవ్ర ప్రతిఘటనకు దిగింది. అలా గత 24 రోజులుగా  భీకర యుద్ధం సాగుతోంది. ఇంతలో మూసివేసిన హర్మోజ్‌ జలసంధిని 48 గంటల్లోగా తెరవాలని ఇరాన్‌కు డెడ్‌లెన్‌ విధించారు ట్రంప్‌. ఈగడువు మంగళవారం ఉదయంతో ముగియనుంది. ఇంతలోనే యుద్దానికి విరామం ప్రకటించడం దిగ్బ్రాంతి రేపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement