
వాషింగ్టన్: అమెరికాలోని హార్వర్డ్ విశ్వవిద్యాలయంపై ట్రంప్ పరిపాలనా విభాగం మరోమారు దృష్టి సారించింది. హార్వర్డ్‌తో పాటు వర్శిటీలోని ఇజ్రాయెల్ విద్యార్థులు పౌర హక్కులను ఉల్లంఘిస్తున్నారని ఆరోపించింది. దీనిపై హార్వర్డ్ అత్యవసర చర్యలు చేపట్టకపోతే సమాఖ్య నిధులను నిలిపివేస్తామని హెచ్చరించింది.
అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. వర్శిటీ పాఠ్యాంశాలు, సిబ్బంది నియామకం, విద్యార్థుల అడ్మిషన్ తదితర విషయాల్లో చేసిన ఆదేశాలను ధిక్కరించిన నేపధ్యంలో ‘హార్వర్డ్’పై ట్రంప్ పాలకవర్గం ఆగ్రహం వ్యక్తం చేసింది. హార్వర్డ్ అధ్యక్షునికి ట్రంప్ యంత్రాంగం పంపిన ఒక లేఖలో.. గాజాలో హమాస్‌పై ఇజ్రాయెల్ యుద్ధానికి వ్యతిరేకంగా క్యాంపస్‌లో జరిగిన నిరసనల్లో విద్యార్థులను రక్షించడంలో వర్శిటీ విఫలమైందని ఆరోపించింది. దీనిపై దర్యాప్తు తర్వాత కూడా హార్వర్డ్ ఉద్దేశపూర్వకంగా ఉదాసీనంగా వ్యవహరించిందని పేర్కొంది.
అమెరికా ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ విలేకరులతో మాట్లాడుతూ ‘హార్వర్డ్’ పౌర హక్కుల చట్టాన్ని ఉల్లంఘిస్తోందని, ఇదేకొనసాగితే సమాఖ్య నిధులు అందవని హెచ్చరించారు. కాగా ట్రంప్ పరిపాలనా విభాగం మసాచుసెట్స్‌లోని విశ్వవిద్యాలయంలో చేరాలనుకునే అంతర్జాతీయ విద్యార్థులకు వీసాలు నిరాకరించాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా రాయబార కార్యాలయాలకు సూచించింది. అయితే హార్వర్డ్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీతో పాటు ఇతర ఏజెన్సీలు దీనిని వ్యతిరేకించాయ. ఇటువంటి చర్యలు చట్టవిరుద్ధమని, రాజ్యాంగ విరుద్ధమని వాదించాయి. దీంతో కోర్టులు ప్రస్తుతానికి ట్రంప్ యంత్రాంగం చేపట్టాలకుకున్న చర్యలకు అడ్డుకట్టవేశాయి. 2024-2025 విద్యా సంవత్సరంలో హార్వర్డ్‌లోని మొత్తం విద్యార్థులలో 27 శాతం మంది విదేశీ విద్యార్థులు ఉన్నారు.
ఇది కూడా చదవండి: వ్యూహాత్మక మిత్రదేశంగా భారత్: ప్రధాని మోదీకి వైట్‌హౌస్ అభినందనలు