breaking news
jewish community
-
హనుక్కా పండుగ అంటే..? అందుకే యూదులు అంతలా..
ఆ్రస్టేలియాలోని సిడ్నీలోని బాండీ బీచ్ కాల్పుల మోతతో దద్దరిల్లిన సంగతి తెలిసిందే. యూదుల సంప్రదాయ హనుక్కా వేడుక విషాదంగా మార్చేసి..సంతోషాన్ని ఆవిరి చేశారు ముష్కరులు. ఆదివారం సెలవరోజు కావడం సరదాగా బీచ్‌లో ఈ పండుగ చేసుకుంటున్న యూదులపై హఠాత్తుగా కాల్పులు జరిపారు ఇద్దరు ఉగ్రవాదులు. ఈ ఘటనలో అక్కడికక్కడే 16 మందికి పైగా మరణించగా, పలువురు తీవ్ర గాయలపాలయ్యారు. ఇలా మతపరమైన వేడుకను లక్ష్యంగా చేసుకుని దాడులు చేశారంటే..ఇది కచ్చితంగా ఉగ్రదాడేనని ఆస్ట్రేలియా ప్రభుత్వం పేర్కొనడం గమనార్హం. ఈ నేపథ్యంలో యూదులు జరుపుకునే పండు హనుక్కా అంటే ఏంటి. ఈ పండుగ ప్రధానోద్ధేశ్యం ఏంటో చూద్దామా..!.యూదుల సంప్రదాయ హనుక్కా వేడుక (Hanukkah)ను "కాంతి పండుగ" అని కూడా పిలుచుకుంటారు. మక్కబీస్ (Maccabees) అనే యోధులు జెరూసలేం ఆలయాన్ని పునఃప్రతిష్ఠించిన అద్భుతానికి గుర్తుగా ఈ వేడుకను ఎనిమిది రోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు. దీనిలో భాగంగా ప్రతిరాత్రి మెనోరా (Menorah) పై(కొవ్వొత్తుల స్టాండ్) కొవ్వొత్తులు వెలిగించి ప్రార్థనలు, ఆటలు, పాటలతో గడుపుతారు. ఆ రోజు నూనెతో చేసిన వంటకాలను తింటారు. ఈ పండుగ అణిచివేత నుంచి సంపాదించుకున్న స్వేచ్ఛ, విశ్వాసాలకు ప్రతీకగా జరుపుకుంటారు యూదులు. హనుక్కా అంటే.."హనుక్కా" అంటే హీబ్రూలో "అంకితం" (dedication) అని అర్థం. ఇది ఆలయ పునఃప్రతిష్ఠను సూచిస్తుంది.అద్భుతం జరిగిన రోజు..క్రీ.పూ. 2వ శతాబ్దంలో గ్రీకు-సిరియన్ పాలకులు యూదుల మత స్వేచ్ఛను అణచివేసినప్పుడు, మక్కబీస్ (Maccabees) అనే యోధులు పోరాడి ఆలయాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నారు. ఆ సమయంలో ఆలయంలో ఒక రోజుకు సరిపడా నూనె ఎనిమిది రోజులు వెలిగిందని ఒక అద్భుతం జరిగింది.ఏరోజున ఈ పండుగ జరుపుకుంటారంటే..ఇది హీబ్రూ క్యాలెండర్ ప్రకారం కిస్లేవ్ (Kislev) నెల 25వ రోజున ప్రారంభమై ఎనిమిది రోజుల పాటు జరుపుకుంటారు. ఎలా జరుపుకుంటారు?మెనోరా వెలిగించడం(ప్రత్యేక దీపపు స్టాండ్): ప్రతి రాత్రి తొమ్మిది కొమ్మల దీపం (Hanukkiah లేదా Menorah) వెలిగిస్తారు. ఒక ప్రత్యేక కొవ్వొత్తి (Shamash) మిగిలిన ఎనిమిదింటిని వెలిగిస్తుంది. ఇది అద్భుతానికి ప్రతీక.డ్రీడెల్ (Dreidel) అనే నాలుగు వైపుల బొంగరంతో ఆడుతూ పాటలు పాడుతూ జరుపుకుంటారు.విందు..ఆరోజు ముఖ్యంగా బంగాళదుపంతో చేసిన పాన్కేక్లను తప్పనిసరిగా ఆరగిస్తారు. దాంతోపాటు జామ్ డోనట్స్‌ను కూడా ఆస్వాదిస్తారు. అంతేగాదు ఆరోజు పిల్లల కోసం ప్రత్యేకంగా చాక్లెట్ బాక్స్‌లను గిఫ్ట్‌గా ఇచ్చి పెద్దలు ఆశీర్వాదాలు అందిస్తుంటారు కూడా.స్వేచ్ఛకు గుర్తుగా చేసుకునే హనుక్కా పండగ రోజునే ఆస్ట్రేలియాలో యూదులపై కాల్పులు జరిపి వేడుకను ఆస్వాదించే స్వేచ్ఛే లేకుండా చేసి తీరని శోకాన్ని నింపారు. నాడు జరిగిన అద్భుతమే జరిగి..తమ పండుగను యూదులు ఆనందంగా జరుపుకోవాలని మనసారా కోరుకుందాం.(చదవండి: ఏఐతో.. 'మెస్సీ'మరైజ్! సెల్ఫీ రూ. 10 లక్షలు..) -
యూదులపై ఉగ్రదాడి
సిడ్నీ: ఆ్రస్టేలియాలోని సిడ్నీలోని బాండీ బీచ్ కాల్పుల మోతతో దద్దరిల్లింది. యూదుల సంప్రదాయ హనుక్కా వేడుక విషాదాంతంగా మారింది. ఆదివారం సాయంత్రం 6.30 గంటల సమయంలో బీచ్‌లో ఉత్సాహంగా పండగలో పాల్గొంటున్న యూదులపై ఇద్దరు ఉగ్రవాదులు హఠాత్తుగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 16 మంది మరణించారు. ఇద్దరు పోలీసులు సహా 38 మంది గాయపడ్డారు. ఇది ముమ్మాటికీ ఉగ్రవాద దాడేనని ఆ్రస్టేలియా ప్రభుత్వం ప్రకటించింది. మతపరమైన వేడుకను లక్ష్యంగా చేసుకోవడం, ఆయుధాలతో విరుచుకుపడడంపై కచ్చితంగా ఉగ్రవాద దాడిగా ప్రభుత్వం పేర్కొంది. యూదులపై కాల్పుల జరిపిన ఇద్దరు ముష్కరులపై పోలీసులు ఎదురు కాల్పులు ప్రారంభించారు. ఒకరిని మట్టుబెట్టారు. పోలీసుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన రెండో ఉగ్రవాది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఉగ్రవాద దాడిని ఆ్రస్టేలియా ప్రధానమంత్రి ఆంథోనీ ఆల్బనీస్ తీవ్రంగా ఖండించారు. ఈ రాక్షస కాండ ఘటన ఆ్రస్టేలియా హృదయాన్ని గాయపర్చిందని ఉద్ఘాటించారు. దుశ్చర్య పట్ల ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు తీవ్రంగా స్పందించారు. యూదులపై విద్వేషాన్ని అల్బనీస్ పరోక్షంగా ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. తాజా దాడికి ఆయనే కారణమని ఆరోపించారు. విచ్చలవిడిగా కాల్పులు ప్రాచీన కాలంలో జెరూసలేం నగరాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్న చరిత్రాత్మక ఘట్టానికి గుర్తుగా ప్రపంచవ్యాప్తంగా యూదులు హనుక్కా పండుగను ప్రతిఏటా ఘనంగా నిర్వహించుకుంటారు. యూదులకు ఇది ప్రధానమైన పండుగ. ఆస్ట్రేలియాలోని యూదులు బాండీ బీచ్‌లో హనుక్కాలో పాల్గొనడానికి భారీగా తరలివచ్చారు. వందలాది మంది గుమికూడారు. ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. సంతోషంగా ఆటపాటల్లో నిమగ్నమయ్యారు. ఇంతలో నల్లటి దుస్తులు ధరించి అక్కడికి చేరుకున్న ఇద్దరు ముష్కరులు తుపాకులతో విచ్చలవిడిగా కాల్పులు ప్రారంభించారు. ఏం జరుగుతోందో అర్థమయ్యేలోపే 16 మంది విగతజీవులయ్యారు. జనం ప్రాణభయంతో పరుగులు తీశారు. బీచ్‌లో ఒక్కసారిగా భయానక వాతావరణం నెలకొంది. యూదులపై కాల్పుల్లో జరిపిన సాయుధ దుండగుల్లో ఒకరిని 24 ఏళ్ల నవీద్ అక్రమ్గా గుర్తించారు. సిడ్నీ బానీరిగ్ ప్రాంతంలోని అతడి నివాసంలో సోదాలు నిర్వహించారు. కాల్పుల ఘటనపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. సంతాపం ప్రకటించిన ప్రధాని మోదీ ఆస్ట్రేలియాలో యూదులపై ఉగ్రవాద దాడి పట్ల భారత ప్రధాని మోదీ ది్రగ్బాంతి వ్యక్తంచేశారు. ముష్కరుల దుశ్చర్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. మృతులకు సంతాపం ప్రకటించారు. బాధిత కుటుంబాలకు భారతీయుల తరఫున సానుభూతి తెలియజేస్తున్నట్లు వెల్లడించారు. ఈ విపత్కర సమయంలో ఆ్రస్టేలియా ప్రజలకు అండగా ఉంటామని ఉద్ఘాటించారు. మానవాళికి పెనుముప్పుగా మారిన ఉగ్రవాదం పట్ల భారత ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తున్నట్లు మోదీ గుర్తుచేశారు. ఉగ్రవాదంపై పోరాటానికి సంపూర్ణ మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. యూకేలో భద్రత కట్టుదిట్టం ఆ్రస్టేలియాలో జరిగిన ఉగ్రదాడిని బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ ఖండించారు. యూదుల మరణించడం పట్ల విచారం వ్యక్తంచేశారు. యూకేలో యూదులు నివసించే ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేసినట్లు తెలిపారు. ముందు జాగ్రత్త చర్యగా లండన్‌లో యూదుల ప్రార్థనా మందిరాలకు పటిష్టమైన భద్రత కల్పిస్తున్నట్లు మెట్రోపాలిటన్ పోలీసులు తెలియజేశారు. సామూహిక వేడుకల్లో పాల్గొనేవారు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. దేశంలో ఆయుధ చట్టాలు కఠినం ఆ్రస్టేలియాలో సామాన్య జనంపై కాల్పులు ఘటనలు చాలా అరుదే. 1996లో పోర్ట్ అర్థర్ టౌన్లో దుండగుడు జరిపిన కాల్పుల్లో 35 మంది మరణించారు. ఈ ఘటన తర్వాత ఆ్రస్టేలియా ప్రభుత్వం ఆయుధ చట్టాలను కఠినతరం చేసింది. ఆయుధ లైసెన్స్‌లు సులభంగా దక్కకుండా చర్యలు చేపట్టింది. ఆ తర్వాత 2014లో జరిగిన కాల్పుల్లో ఐదుగురు, 2018లో ఏడుగురు మృతిచెందారు. ఆయా ఘటనల్లో సాయుధులు తమ కుటుంబ సభ్యులపైనే కాల్పులు జరిపి, తర్వాత ఆత్మహత్యకు పాల్పడ్డారు. 2019లో ఉత్తర ఆ్రస్టేలియాలోని డారి్వన్ సిటీలో జైలు నుంచి పెరోల్‌పై బయటకు వచి్చన ఖైదీ జరిపిన కాల్పుల్లో నలుగురు మృతిచెందారు. 2022లో క్వీన్స్లాండ్ స్టేట్‌లో ఓ తీవ్రవాది జరిపిన కాల్పుల్లో ఇద్దరు పోలీసు అధికారులు మరణించారు. ఆ్రస్టేలియాలో భారీ ఎత్తున కాల్పులు జరగడం, పది మందికిపైగా ప్రాణాలు కోల్పోవడం ఇటీవలి కాలంలో ఇదే మొదటిసారి. పెచ్చరిల్లుతున్న యూదు వ్యతిరేకత ఆ్రస్టేలియా జనాభా 2.8 కోట్లు. వీరిలో 1.17 లక్షల మంది యూదులు ఉన్నారు. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్ యుద్ధం మొదలైన తర్వాత ఆ్రస్టేలియాలోని యూదులపై దాడులు పెరిగిపోయాయి. వారి ఆస్తుల విధ్వంసం, బెదిరింపులు చోటుచేసుకుంటున్నాయి. యూదు వ్యతిరేక ఘటనలు తరచుగా జరుగుతున్నాయి. గత ఏడాది సిడ్నీ, మెల్బోర్న్ నగరాల్లో యూదులే లక్ష్యంగా దాడులు జరిగాయి. యూదుల ప్రార్థనా మందిరాలకు, వారి వాహనాలకు నిప్పుపెట్టారు. మరోవైపు యూదులకు తగిన రక్షణ కల్పించాలని ఇజ్రాయెల్ ప్రభుత్వం ఆ్రస్టేలియా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.రియల్ హీరో అహ్మద్ బీచ్‌లో ముష్కరులు కాల్పులు జరుపుతుండగా అహ్మద్ అనే వ్యక్తి ప్రాణాలకు తెగించి అడ్డుకున్నాడు. చెట్టు చాటు నుంచి బుల్లెట్ల వర్షం కురిపిస్తున్న ఓ ఉగ్రవాదిని గట్టిగా పట్టుకొని, తుపాకీను లాక్కొని అతడికే గురిపెట్టాడు. అహ్మద్‌ను గమనించిన మరో మరో ఉగ్రవాది కాల్పులు ప్రారంభించారు. దాంతో అహ్మద్ గాయాలపాలై కుప్పకూలిపోయాడు. పోలీసులు అతడిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స కొనసాగుతోంది. అహ్మద్ సాహసోపేతంగా వ్యవహరించిన దృశ్యం ఆస్ట్రేలియా టీవీ చానళ్లలో ప్రసారమైంది. అతడు ధైర్యంగా అడుగు ముందుకు వేయకపోతే ఉగ్రవాదుల కాల్పుల్లో మరికొందరు మరణించేవారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. రియల్ హీరో అహ్మద్ అంటూ జనం ప్రశంసిస్తున్నారు. -
‘హార్వర్డ్’కు ట్రంప్ మరో షాక్.. యూదు హక్కులపై వేటు
వాషింగ్టన్: అమెరికాలోని హార్వర్డ్ విశ్వవిద్యాలయంపై ట్రంప్ పరిపాలనా విభాగం మరోమారు దృష్టి సారించింది. హార్వర్డ్‌తో పాటు వర్శిటీలోని ఇజ్రాయెల్ విద్యార్థులు పౌర హక్కులను ఉల్లంఘిస్తున్నారని ఆరోపించింది. దీనిపై హార్వర్డ్ అత్యవసర చర్యలు చేపట్టకపోతే సమాఖ్య నిధులను నిలిపివేస్తామని హెచ్చరించింది.అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. వర్శిటీ పాఠ్యాంశాలు, సిబ్బంది నియామకం, విద్యార్థుల అడ్మిషన్ తదితర విషయాల్లో చేసిన ఆదేశాలను ధిక్కరించిన నేపధ్యంలో ‘హార్వర్డ్’పై ట్రంప్ పాలకవర్గం ఆగ్రహం వ్యక్తం చేసింది. హార్వర్డ్ అధ్యక్షునికి ట్రంప్ యంత్రాంగం పంపిన ఒక లేఖలో.. గాజాలో హమాస్‌పై ఇజ్రాయెల్ యుద్ధానికి వ్యతిరేకంగా క్యాంపస్‌లో జరిగిన నిరసనల్లో విద్యార్థులను రక్షించడంలో వర్శిటీ విఫలమైందని ఆరోపించింది. దీనిపై దర్యాప్తు తర్వాత కూడా హార్వర్డ్ ఉద్దేశపూర్వకంగా ఉదాసీనంగా వ్యవహరించిందని పేర్కొంది.అమెరికా ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ విలేకరులతో మాట్లాడుతూ ‘హార్వర్డ్’ పౌర హక్కుల చట్టాన్ని ఉల్లంఘిస్తోందని, ఇదేకొనసాగితే సమాఖ్య నిధులు అందవని హెచ్చరించారు. కాగా ట్రంప్ పరిపాలనా విభాగం మసాచుసెట్స్‌లోని విశ్వవిద్యాలయంలో చేరాలనుకునే అంతర్జాతీయ విద్యార్థులకు వీసాలు నిరాకరించాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా రాయబార కార్యాలయాలకు సూచించింది. అయితే హార్వర్డ్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీతో పాటు ఇతర ఏజెన్సీలు దీనిని వ్యతిరేకించాయ. ఇటువంటి చర్యలు చట్టవిరుద్ధమని, రాజ్యాంగ విరుద్ధమని వాదించాయి. దీంతో కోర్టులు ప్రస్తుతానికి ట్రంప్ యంత్రాంగం చేపట్టాలకుకున్న చర్యలకు అడ్డుకట్టవేశాయి. 2024-2025 విద్యా సంవత్సరంలో హార్వర్డ్‌లోని మొత్తం విద్యార్థులలో 27 శాతం మంది విదేశీ విద్యార్థులు ఉన్నారు.ఇది కూడా చదవండి: వ్యూహాత్మక మిత్రదేశంగా భారత్: ప్రధాని మోదీకి వైట్‌హౌస్ అభినందనలు -
ఆస్ట్రియన్ పర్యాటకురాలికి కేరళ పోలీసుల సమన్లు
కేరళలోని ఫోర్ట్ కొచ్చిలో వివాదాస్పద ఉదంతం చోటుచేసుకుంది. పాలస్తీనా అనుకూల పోస్టర్‌ను చింపివేసూ ఒక ఆస్ట్రియన్ యూదు పర్యాటకురాలు కేరళలో స్థానికులతో వాదిస్తూ కెమెరాకు చిక్కింది. ఈ వారం ప్రారంభంలో ఎర్నాకులం జిల్లా ఫోర్ట్ కొచ్చిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో పోస్టర్‌ను చింపివేస్తున్న ఆమెను వారించేందుకు స్థానిక యువకులు ప్రయత్నించగా, ఆమె వారితో వాగ్వాదానికి దిగడం కనిపిస్తుంది. ఆ పోస్టర్ చినిగిన ముక్కలను తీయమని అక్కడున్న యువకులు ఆమెకు చెప్పడాన్ని వీడియోలో చూడవచ్చు. ఆ గోడపత్రికతో సమస్య ఉంటే పోలీసులను సంప్రదించాలని వారు ఆమెకు సూచించడాన్ని కూడా ఆ వీడియోలో గమనించవచ్చు. An Austrian tourist tears down pro-palestinian posters in Kochi, India. What an entitled Zionist woman. Kerala Police filed a FIR against her. pic.twitter.com/X4CM7tIJCM — Mahesh Kusumagiri (@maheshkusumagir) April 17, 2024 ఈ వీడియో వైరల్‌గా మారిన నేపధ్యంలో కేరళ పోలీసులు విచారణ కోసం ఆ మహిళను పోలీస్ స్టేషన్‌కు రావాలని కోరారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఓ)కొచ్చి ఏరియా సెక్రటరీ మహమ్మద్ అజీమ్ కెఎస్ ఆ మహిళపై ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు ఎటువంటి కేసులు నమోదు చేయలేదు. ఎస్ఐవో అతికించిన పోస్టర్లను ఆ ఆస్ట్రియన్ యువతి చించివేసింది. కాగా గత జనవరిలో కోజికోడ్ బీచ్ సమీపంలోని స్టార్‌బక్స్ స్టోర్‌పై పాలస్తీనా అనుకూల పోస్టర్లు అతికించిన ఆరుగురు విద్యార్థులను కేరళ పోలీసులు అరెస్టు చేశారు. నాడు నమోదైన ఎఫ్ఐఆర్ ప్రకారం స్టార్‌బక్స్ స్టోర్ గ్లాస్ డోర్‌పై ఆ విద్యార్థులు ‘ఫ్రీ పాలస్తీనా’ అని రాసిన పోస్టర్లను అతికించారు. గాజాలో జరిగిన యుద్ధ నేపధ్యంలో స్టార్‌బక్స్ ఇజ్రాయెల్‌కు అనుకూల వైఖరిని ప్రదర్శించినదుకు విమర్శలకు గురైంది. -
యూదుల వివాహాలు ఎలా జరుగుతాయి? ఏడు అడుగులు దేనికి చిహ్నం?
యూదు సంస్కృతిలో వివాహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. జీవితంలో వివాహమనేది తప్పనిసరిగా జరగాలని యూదులు భావిస్తారు. ఇతర మతాలలోని మాదిరిగానే వివాహాన్ని పవిత్ర బంధంతో కూడిన ఒప్పందంగా పరిగణిస్తారు. 18, 19వ శతాబ్దాల మధ్య కాలంలో యూదుల మతం, సంస్కృతి పరిఢవిల్లింది. వివాహ ఆచారాలు కూడా ఏర్పడ్డాయి. జుడాయిజంలో వివాహం అనేది ఒక పవిత్ర ఒప్పందం. దీనికి శుభ సమయం అంటూ ఉండదు. సాధారణంగా వివాహాలను ఆదివారం నిర్వహిస్తుంటారు. సన్నిహితుల సమక్షంలో వధువు- వరుడు తమ వివాహానికి సమ్మతి తెలియజేస్తారు. జీవితాంతం ఒకరికి ఒకరుగా కలిసి జీవిస్తామని వాగ్దానం చేస్తారు. యూదుల సంస్కృతిలో వివాహాన్ని కిద్దుషిన్ అంటారు. వివాహ వేడుకకు ముందు యూదులు ఉంగరాన్ని ధరించే వేడుకను నిర్వహిస్తారు. దీనిని హిందూ, ఇతర మతాలలో నిశ్చితార్థం అని అంటారు. యూదులలో వివాహానికి ముందు వధూవరులు కలుసుకునే సంప్రదాయాన్ని ‘యోమ్ కిప్పూర్ విడ్డూయ్’ అని అంటారు. దీనిలో అబ్బాయి, అమ్మాయి కలుసుకుంటారు. ఒప్పుకోలు ప్రార్థనలో పాల్గొంటారు. గత జీవితంలోని అన్ని తప్పులకు క్షమించాలని పరస్పరం వేడుకుంటారు. ఒకరికొకరు నమ్మకంగా మెలుగుతామని ప్రమాణం చేస్తారు. యూదుల వివాహాల్లో చుప్పా(వివాహ వేదిక)కు ఎంతో ప్రాముఖ్యతనిస్తారు. చుప్పాలో వధూవరులు ఏడు ప్రదక్షిణలు చేస్తారు. అలాగే ఆచారం ప్రకారం జరిగే తంతు ఉంటుంది. వధూవరులు ఏడు అడుగులు వేయడం అనేదాన్ని పరిపూర్ణతకు చిహ్నంగా భావిస్తారు. వధూవరులు ఉంగరాలు మార్చుకుంటారు. వరుడు.. వధువు కుడి చూపుడు వేలుకు ఉంగరాన్ని అలంకరిస్తాడు. తరువాత వధూవరులు అందరి సమక్షంలో తాము జీవితాంతం కలసి ఉంటామని ప్రమాణం చేస్తారు. అలాగే వధూవరుల వివాహ ఒప్పందాన్ని ఆహ్వానితుల సమక్షంలో చదువుతారు. వేడుక ముగింపులో వరుడు ఒక గాజు గ్లానుసు పగలగొట్టి, దానిని తన కుడి పాదంతో చూర్ణం చేస్తాడు. ఈ సమయంలో అతిథులు ‘మజెల్ తోవ్’ అని అరుస్తారు. ఇది ఇది హీబ్రూలో శుభాకాంక్షలు తెలియజేయడాన్ని సూచిస్తుంది. దీని తరువాత వరునికి ఒక చిన్న కప్పులో వైన్ అందిస్తారు. ఇదేవిధంగా వధువు కూడా వైన్ తాగుతుంది. వారం రోజుల తర్వాత అతిథులు, బంధువులు కలిసి వధూవరులకు ఘనమైన విందు ఇస్తారు. ఈ సందర్భంగా ఒక ప్రత్యేకమైన సంప్రదాయ నృత్యం కూడా చేస్తారు. ఇది కూడా చదవండి: నవరాత్రుల్లో విషాదం -
యూదుల ప్రత్యేక దేశాన్ని గాంధీ ఎందుకు వ్యతిరేకించారు?
హమాస్- ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న పోరులో ఇప్పటివరకు 3000 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. హమాస్ దాడిని ప్రపంచ దేశాలన్నీ ఖండించి ఇజ్రాయెల్‌కు మద్దతు తెలిపాయి. భారత్ కూడా ఇజ్రాయెల్‌కు అండగా నిలిచింది. అయితే ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదంపై నాటి రోజుల్లో మహాత్మా గాంధీ ఏమన్నారు? పాలస్తీనాలో ప్రత్యేక యూదు దేశస్థాపనను గాంధీ ఎందుకు వ్యతిరేకించారు? మహాత్మా గాంధీ 1938, నవంబర్ 26న ‘హరిజన్’ పత్రికలో ‘ది జ్యూస్’ అనే శీర్షికతో ఒక వ్యాసం రాశారు. ఈ ఆర్టికల్‌లో ‘ఇంగ్లండ్ బ్రిటీష్ వారికి చెందినట్లే, ఫ్రాన్స్ ఫ్రెంచి వారిది. పాలస్తీనా అరబ్బులదని రాశారు. అయితే ఏళ్ల తరబడి యూదులు అణచివేత, వివక్షను ఎదుర్కోవలసి రావడంపై మహాత్మాగాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. గాంధీ తన వ్యాసంలో ఇలా రాశారు ‘నాకు యూదుల విషయంలో తీవ్రమైన ఆవేదన ఉంది. వీరు క్రైస్తవ సమాజంలో అంటరానివారిగా మిగిలారు. హిందూ సమాజంలో అంటరానితనం సమస్య ఉన్నట్లే, యూదులు కూడా ఈ సమస్యను ఎదుర్కోవలసి వస్తోంది. ఎన్నో అవమానాలను కూడా ఎదుర్కొన్నారు. యూదుల విషయంలో నాజీ జర్మనీ ప్రవర్తించిన హీనమైన తీరు చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుంది’ అని అన్నారు. కాగా యూదులను రక్షించడానికి, వారిపై జరుగుతున్న మారణహోమం ఆపడానికి జర్మనీతో యుద్ధాన్ని గాంధీ సమర్థించారు. ‘యూదులను రక్షించడానికి మనం జర్మనీతో పోరాడవలసి వస్తే, అది కూడా పూర్తిగా తార్కికంగా ఉంటుందని’ అన్నారు. పాలస్తీనాలో ప్రత్యేక యూదు రాజ్య స్థాపనను మహాత్మా గాంధీ ఎందుకు వ్యతిరేకించారనే విషయానికొస్తే ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లోని ఒక నివేదిక ప్రకారం మహాత్మా గాంధీ ఒక వ్యాసంలో ఇలా రాశారు ‘పాలస్తీనాలో యూదుల స్థిరనివాసం కల్పించడం లేదా వారుంటున్న ప్రాంతాన్ని ఒక దేశంగా గుర్తించడం అనేది అరబ్ ప్రజలకు మరింత గౌరవాన్ని తీసుకువస్తుంది’ అని అన్నారు. ఈ విషయంలో మహాత్మా గాంధీ వ్యతిరేకత రెండు సూత్రాలపై ఆధారపడింది. మొదటిది పాలస్తీనా ఇప్పటికే అరబ్ ప్రజల జన్మస్థలమని గాంధీ విశ్వసించారు. బ్రిటిష్ పాలనలో యూదులను బలవంతంగా అక్కడ స్థిరపడ్డారు. ఇది ఒక విధంగా అరబ్ ప్రజల ప్రాథమిక సూత్రాలను ఉల్లంఘించడమే. ఇక రెండవది.. ప్రత్యేక దేశం కోసం యూదుల డిమాండ్ తాను అనుసరిస్తున్న శాంతియుత పోరాటానికి విరుద్ధంగా ఉందని గాంధీ భావించారు. అయితే ఆ సమయంలో గాంధీ ఈ అంశాన్ని బహిరంగంగా వెల్లడించలేదు. ఇది కూడా చదవండి: పార్లమెంట్ ద్వారాలకు జంతువుల పేర్లెందుకు? -
వీరి జీవనం ‘ప్రత్యేకం’
సాక్షి, అమరావతి బ్యూరో/తెనాలి: రాష్ట్రంలో యూదు జాతీయులు దాదాపు 125 కుటుంబాలున్నట్టు అంచనా. వాటిలో 40 కుటుంబాల వారు గుంటూరు జిల్లా చేబ్రోలు సమీపంలోని కొత్తరెడ్డిపాలెంలో జీవనం సాగిస్తున్నారు. వీరంతా ఎఫ్రాయిమ్ గోత్రీకులు. వీరి పూర్వీకులు తొలుత తెలంగాణ, అమరావతిలో నివసించారు. అయితే బ్రిటిష్ హయాంలో వీరిలో ఒకరికి కొత్తరెడ్డిపాలెం ప్రాంతంలో ఉద్యోగం రావడంతో వీరి మకాం ఇక్కడికి మారింది. ఈ 40 కుటుంబాల్లోని 300 మంది వందల ఏళ్లుగా తెలుగు జన జీవన స్రవంతిలో కలిసి పోయినా తమ మాతృ భాష, ఆచార సంప్రదాయాలను కాపాడుకుంటూ వస్తున్నారు. ఏకైక ప్రార్థన మందిరం ఇదే.. ఏపీలో యూదుల ఏకైక ప్రార్థన మందిరం(సమాజ మందిరం) బెనె యాకోబ్ సినగాగె. ఇది 111 ఏళ్లుగా కొత్తరెడ్డిపాలెంలో కొనసాగుతోంది. మందిర నిర్వాహకుడి పేరు సాదోక్ యాకోబి. ఆయనతో పాటు ఏడుగురు పెద్దలుంటారు. వీరు మత ప్రచారం చేయరు. దేవుడి పేరు కూడా ఉచ్ఛరించరు. ప్రతి శనివారం విశ్రాంతి దినం (షబ్బాత్). ఆ రోజు అసలు పనులకు వెళ్లరు. ఆదివారం హెబ్రూ భాషకు సంబంధించిన స్కూలు నడుస్తుంది. హె బ్రూ క్యాలెండర్ ప్రకారం సృష్టి ఆరంభం నుంచి ప్రస్తుతం నడుస్తోంది 5,781 సంవత్సరం. సృష్టి పుట్టిన దినాన్ని కొత్త సంవత్సరంగా పరిగణిస్తారు. ‘తిషిరి’(సెప్టెంబర్‌లో వస్తుంది) నెలతో వీరి సంవత్సరం ప్రారంభమవుతుంది. పండుగ దినాల్లో యూదులంతా కలుస్తారు. పెద్ద ల ఆధ్వర్యంలో జరిగే వీరి వివాహా ల్లో వరకట్నం ఉండదు. వరుడే ఓలి ఇస్తా రని సమాజ పెద్ద ఇట్స్‌కాక్ చెప్పారు. వీరి ఉనికి అలా తెలిసింది.. బెనె ఎఫ్రాయిమ్ గోత్రాన్ని హెబ్రూలో ‘మగద్దీన్’ అంటారు. వీరిని మట్టుబెట్టేందుకు కుట్ర పన్ని, రెక్కీ నిర్వహించారన్న ఆరోపణలపై భారత ప్రభుత్వం 2004లో లష్కరే తోయిబాకు చెందిన 8 మందిని అరెస్ట్ చేసింది. అప్పుడే ఈ ప్రాంతంలో వీరి ఉనికి బహిర్గతమైంది. ఈ ప్రాంతంలోని ఎక్కువ మంది యూదులు వ్యవసాయ కూలీలు. ఉద్యోగాల్లో స్థిరపడ్డ వారూ ఉన్నారు. ‘లా ఆఫ్ రిటర్న్’లో తమ వంతు కోసం ఎదురుచూపులు ఇజ్రాయిల్ దేశం తెచ్చిన ‘లా ఆఫ్ రిటర్న్’ జీవోతో ఎక్కడెక్కడో ఉంటున్న యూదు జాతీయులకు మాతృదేశం వెళ్లే అవకాశం లభించింది. మణిపూర్, మిజోరాం నుంచి ‘మనష్’ గోత్రీకులు పెద్దసంఖ్యలో స్వదేశం వెళ్లారు. తమ వంతు కోసం ఇక్కడివారు ఎదురుచూస్తున్నారు. హెబ్రూకు తెలుగుకు సంబంధం.. హెబ్రూ భాషకు తెలుగుకు దగ్గర సంబంధం ఉందని కనుగొన్నా. రెంటికీ సంబంధమున్న, ఒకే అర్థం కలిగిన 300 పదాలను గుర్తించా. మరిన్ని విశేషాలతో త్వరలోనే పుస్తకం తీసుకొస్తా. – షమ్ముయేల్ యాకోబి, మత పరిశోధకుడు -
5,232 మంది హత్యకు సాయం.. రెండేళ్ల శిక్ష
బెర్లిన్: నరకానికి నకళ్ల లాంటి నాజీ క్యాంప్ పేరు చెబితే ఇప్పటికి జర్మన్ ప్రజలు భయభ్రాంతులకు గురవుతారు. యూదుల మీద కోపంతో నియంత అడాల్ఫ్ హిట్లర్ వారిని ఊచకోత కోయడం కోసం ఏర్పాటు చేసిన ఈ క్యాంపుల్లో ఎందరో బలయ్యారు. అయితే నాటి కాలానికి సంబంధించిన నేరాల గురించి నేటికి జర్మనీలో విచారణ జరుగుతుంది. ఈ క్రమంలో చివరి కేసులో జర్మన్ కోర్టు గురువారం తీర్పు వెల్లడించింది. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో నాజీ కాన్సంట్రేషన్ క్యాంప్‌లో సుమారు 5,232 మంది ఖైదీలను, అనేక మంది యూదులను హత్య చేయడానికి సాయం చేసిన 93 ఏళ్ల బ్రూనో డి అనే వ్యక్తిని హాంబర్గ్ కోర్టు దోషిగా తేల్చింది. నాటి నేరాలకు గాను అతడికి రెండు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ప్రస్తుతం పోలాండ్లోని గ్డాన్స్క్కు సమీపంలోని స్టుతోఫ్ కాన్సంట్రేషన్ క్యాంప్‌లో ఎస్ఎస్ బ్రూనో డి గార్డుగా పని చేసేవాడు. ఈ క్రమంలో 1944 ఏప్రిల్ 1945 మధ్య జరిగిన ఈ హత్యలకు బ్రూనో డి సహకరించినట్లు హాంబర్గ్ కోర్టు గురువారం తెలిపింది. ఈ నేరం జరిగినప్పుడు బ్రూనో డి వయసు కేవలం 17, 18 సంవత్సరాలు కావడంతో అతడికి యువత శిక్షా మార్గదర్శకాలకు లోబడి శిక్ష విధించినట్లు కోర్టు తెలిపింది. ఈ క్రమంలో బ్రూనో డి ఆ సమయంలో తాను అక్కడ విధులు నిర్వహిస్తున్నట్లు అంగీకరించాడు. అయితే హత్యలకు సహకరించాల్సి వచ్చిందని.. దానిలో తన తప్పమే లేదని తెలిపాడు. అంతేకాక నాటి నరకంలో ప్రాణాలు కోల్పోయిన వారికి, వారి కుటుంబ సభ్యులకు, మిత్రులకు క్షమాపణ తెలిపాడు. స్టుతోఫ్లో దాదాపు 65 వేల మందిని హత్య చేశారని మ్యూజియం వెబ్సైట్ వెల్లడిస్తుంది. వీరిలో యూదులతో పాటు ఇతరులు కూడా ఉన్నట్లు వెబ్సైట్లో ఉంది. వీరిలో కొందరిని తల వెనక భాగంలో కాల్చి చంపగా.. మరి కొందరి మీద ప్రాణాంతకమైన జైక్లాన్ బీ వాయువు ప్రయోగించి చంపినట్లు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. -
కాలిఫోర్నియాలో కాల్పుల కలకలం
వాషింగ్టన్ : కాలిఫోర్నియాలో గుర్తు తెలియని ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. పోవేలోని యూదుల ప్రార్థనా మందిరంలో విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఒక వ్యక్తి మరణించగా..మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అనుమానితుడిగా భావిస్తున్న పందొమ్మిదేళ్ల యువకుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా జాతి విద్వేషం కారణంగానే దుండుగుడు కాల్పులు జరిపినట్టు భావిస్తున్నారు. ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ప్రస్తుతానికి దీనిని జాతి విద్వేష చర్యగానే భావిస్తున్నామని తెలిపారు. ఈ ఘటనలో మృతి చెందిన, గాయపడిన వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. ఈ మేరకు... ‘ కాలిఫోర్నియాలోని పోవేలో గల సినాగోగ్(యూదుల ప్రార్థనా మందిరం)పై జరిగిన కాల్పుల్లో మరణించిన, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా. ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి. అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. చట్ట సంస్థలు (పోలీసులు) అద్భుతంగా తమ విధిని నిర్వర్తిస్తున్నాయి. ధన్యవాదాలు అని ఆయన ట్వీట్ చేశారు. Thoughts and prayers to all of those affected by the shooting at the Synagogue in Poway, California. God bless you all. Suspect apprehended. Law enforcement did outstanding job. Thank you! — Donald J. Trump (@realDonaldTrump) April 27, 2019 -
ఆ వర్గం భవిష్యత్‌లో కనిపించదా?
వెనక్కు తిరిగి చూసుకుంటే 2 వేల సంవత్సరాల చరిత్ర. ఎన్నో అటూపోట్లు. అన్నింటినీ సమర్ధంగా ఎదుర్కొని నిలబడినా కాలం దేన్నేయినా చరిత్రలో కలిపేసుకుంటుంది కదా. 'బెనే ఇస్రాయిల్' వర్గం భారతదేశంలో మిణుకుమిణుకు వెలుగుతున్న ఓ దీపం. వేల సంవత్సరాల కిందట ఇజ్రాయెల్ నుంచి మన దేశానికి వచ్చిన కొందరు 'జ్యూ'లు అప్పటి బొంబాయిని తమ సొంతవూరిగా మార్చుకున్నారు. అక్కడే జీవనం సాగిస్తూ వస్తున్నారు. 2010లో ఓ ఫోటోగ్రాఫర్‌కు తీసిన ఫోటో భారతదేశంలో అంతరించిపోతున్న ఇజ్రాయిలీల గురించి బయటకు తెచ్చింది. ఆ ఫోటో తీసిన కొద్ది రోజుల తర్వాత వేరే షూట్ ప్రయత్నాల్లో ఉన్న ఫోటోగ్రాఫర్ అహ్మదాబాద్‌లో స్ధిరనివాసం ఏర్పరచుకున్న ఇండియన్-జ్యూయిష్ రచయిత ఈస్టర్ డేవిడ్‌ను కాకతాళీయంగా కలిశారు. అప్పుడు గానీ తెలియలేదు భారత్‌కు వచ్చిన ఇజ్రాయిలీలు ఇక్కడే ఎందుకు స్ధిరపడ్డారో. వారికెందుకు భారతీయ వాతావరణం నచ్చిందో. దాంతో తన తర్వాతి షూట్ ఇదేనని నిర్ణయించుకున్నాడు. డేవిడ్‌తో కొద్దిరోజులు పాటు అహ్మదాబాద్‌లో ప్రయాణం చేసి జ్యూల సంప్రదాయాన్నీ అద్భుతంగా చిత్రీకరించాడు. ఈ సమయంలో జ్యూలు ఫోటోగ్రాఫర్‌తో చెప్పిన విషయం ప్రపంచంలో ఎక్కడికెళ్లినా దొరకని స్వతంత్రం భారతదేశంతో లభిస్తోందని. ఆ మాట విన్న ఫోటోగ్రాఫర్ కళ్లలో నీళ్లు గిర్రున తిరిగాయి. ప్రస్తుతం దేశంలో చాలా తక్కువ మంది జ్యూలు ఉన్నారు. వారి వర్గం క్రమంగా తగ్గిపోతోంది.


