కాలిఫోర్నియాలో కాల్పుల కలకలం

Shooting At California Synagogue Possibly May Hate Crime - Sakshi

వాషింగ్టన్‌ : కాలిఫోర్నియాలో గుర్తు తెలియని ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు.  పోవేలోని యూదుల ప్రార్థనా మందిరంలో విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఒక వ్యక్తి మరణించగా..మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అనుమానితుడిగా భావిస్తున్న పందొమ్మిదేళ్ల యువకుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా జాతి విద్వేషం కారణంగానే దుండుగుడు కాల్పులు జరిపినట్టు భావిస్తున్నారు.

ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్పందించారు. ప్రస్తుతానికి దీనిని జాతి విద్వేష చర్యగానే భావిస్తున్నామని తెలిపారు. ఈ ఘటనలో మృతి చెందిన, గాయపడిన వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. ఈ మేరకు... ‘ కాలిఫోర్నియాలోని పోవేలో గల సినాగోగ్‌(యూదుల ప్రార్థనా మందిరం)పై జరిగిన కాల్పుల్లో మరణించిన, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా. ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి. అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. చట్ట సంస్థలు (పోలీసులు) అద్భుతంగా తమ విధిని నిర్వర్తిస్తున్నాయి. ధన్యవాదాలు అని ఆయన ట్వీట్‌ చేశారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top