
బ్యాంకాక్: థాయ్‌లాండ్, కంబోడియా సరిహదద్దు వివాదం కారణంగా ఇరుదేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. అయినప్పటికీ థాయ్‌లాండ్ యువ ప్రధాని పేటోంగ్టార్న్ షినవత్ర పొరుగున ఉన్న కంబోడియా మాజీ ప్రధాని హున్‌సేన్‌కు ఫోన్ చేశారు.ఫోన్‌లో అంకుల్.. మా ఆర్మీ కమాండర్ నామాట వినడం లేదు. నాకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ఆ తర్వాత ఇరువురి మధ్య జరిగిన ఫోన్ కాల్ సంభాషణ లీకైంది. థాయ్‌లాండ్ రాజ్యాంగ న్యాయస్థానం ఆమెను ప్రధాని పదవి నుంచి సస్పెండ్ చేసింది.
ఇలా అతిచిన్న వయస్సులో దేశానికి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన షినవత్ర.. పదవిని కోల్పోవడం చర్చాంశనీయంగా మారింది. ఈ క్రమంలో షినవత్రతో పాటు ఆమె తండ్రి థాక్సిన్ షినవత్ర ,మేనత్త యింగ్‌లక్ షినవత్ర గురించి పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. షినవత్ర ఎలా అర్ధాంతరంగా పదవి పోగొట్టుకున్నారో తండ్రి,మేనత్తలు కూడా థాయ్‌లాండ్ ప్రధానులుగా పనిచేస్తుండగానే కోర్టు తీర్పు కారణంగా పదవీచిత్యులయ్యారు.
షినవత్ర కుటుంబం థాయ్‌లాండ్ రాజకీయాల్లో శక్తివంతమైన కుటుంబం.వివాదాస్పదమైన వంశం. ఈ కుటుంబానికి చెందిన ఆరు ప్రధానులు గత 20 సంవత్సరాల్లో సైనిక తిరుగుబాట్లు, న్యాయస్థానాల తీర్పుల ద్వారా పదవుల నుంచి తొలగించబడ్డారు.
తండ్రి థాక్సిన్ షినవత్ర
థాక్సిన్ షినవత్ర 2001–2006 థాయ్‌లాండ్ ప్రధానిగా పనిచేశారు.2006లో సైనిక తిరుగుబాటు కారణంగా పదవి కోల్పోయారు. ఆయనపై అవినీతి, అధికార దుర్వినియోగం,రాజ్యానికి విరుద్ధంగా వ్యవహరించారనే ఆరోపణలు వచ్చాయి. తిరుగుబాటు సమయంలో ఆయన విదేశాల్లో ఉండగా, తిరిగి రావడం కష్టమైంది.తర్వాత విదేశాల్లో తలదాచుకున్నారు
మేనత్త యింగ్‌లక్ షినవత్ర
యింగ్‌లక్ షినవత్ర 2011–2014 మధ్య కాలంలో థాయ్‌లాండ్ ప్రధానిగా పని చేశారు. ఆమె రైస్ సబ్సిడీ స్కీమ్లో ఆర్థిక అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు గుప్పుమన్నాయి. విచారణ చేపట్టిన థాయ్‌లాండ్ రాజ్యాంగ న్యాయస్థానం 2014లో ప్రధాని పదవి నుంచి యింగ్‌లక్‌కు ఉద్వాసన పలికింది. రాజ్యాంగ న్యాయస్థానం తీర్పువెలువడిన వెంటనే ఆ దేశంలో సైనిక తిరుగుబాటు జరిగింది.ప్రభుత్వం కుప్పకూలింది. వెంటనే ఆమె దేశం వదిలి వెళ్లిపోయారు.
పెహూ తై పార్టీ ద్వారా ప్రజాదరణ పొందిన పాలనను కొనసాగించేందుకు షినవత్ర కుటుంబం ప్రయత్నించింది. కానీ సైనిక తిరుగుబాటు,అవినీతి ఆరోపణలు షినవత్ర వంశం ప్రతిష్టను దెబ్బతీవాయి. తాజాగా, షినవత్ర సైతం ఒక్క ఫోన్ కాల్‌తో ప్రధాని పదవికి రాజీనామా చేసి రాజకీయ నిరుద్యోగిగా మిగలాల్సి వచ్చింది.