పుల్వామా అటాక్ కు ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ భారత్ సామర్థ్యాన్ని ప్రపంచానికి తెలిసేలా చేసింది. ఈ నేపథ్యంలో ఇటీవల లోవీ ఇనిస్టిట్యూట్ చేపట్టిన సర్వేలో భారత్ 40 స్కోరుతో మూడో స్థానంలో నిలిచింది. అమెరికా 80 పాయింట్లతో మెుదటి స్థానంలో నిలువగా చైనా 73.7 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. భారత్ తరువాత 38.8 తో జపాన్ , 32.1తో రష్యా వరుసగా , నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నాయి.
అయితే రక్షణ నెట్ వర్క్ ల అంశంలో భారత్ రెండు స్థానాలు కోల్పోయి 11 స్థానంలో నిలిచింది. అదే పెట్టుబడులను ఆకర్షించే అంశంలో చైనాను వెనక్కి నెట్టి భారత్ రెండో స్థానంలో నిలిచింది. ఈ సూచికలో అమెరికా మెుదటి ప్లేస్ లో ఉంది. ఆర్థిక, మిలిటరీ రంగాలలో మంచి పురోగతి సాధించడంతోనే భారత్ ర్యాంకు మెరుగుపడిందని విశ్లేశకులు అంచనా వేస్తున్నారు. సాంకేతికత, పరపతి, అంతర్జాతీయ సంబంధాలు తదితర అంశాల ఆధారంగా ర్యాంకులను లోవీ ఇనిస్టిట్యూట్ ర్యాంకులను ప్రకటిస్తుంది. భారత్ సైనిక సామర్థ్యం ప్రస్తుతం ఎంతో మెరుగ్గా ఉందని సంస్థ పేర్కొంది.


