కొన్ని ఫొటోలు అంతే.. అలా కుదిరిపోతాయంతే..

Simon Needham Photo: Proud Lion Standing On Hill Of Bones - Sakshi

వెనుక సూర్యుడు ఉదయిస్తుండగా..
ఎముకల కొండపై ఠీవిగా నిల్చుని..
ఏదో తన సామ్రాజ్యాన్నిపర్యవేక్షిస్తున్నట్లుగా..  
కొన్ని ఫొటోలు అంతే.. అలా కుదిరిపోతాయంతే..

చూడగానే.. ఫేమస్‌ హాలీవుడ్‌ మూవీ లయన్‌ కింగ్‌ నుంచి దిగొచ్చినట్లు లేదూ.. ఈ చిత్రాన్ని దక్షిణాఫ్రికాలోని జీజీ కన్జర్వేషన్‌ వైల్డ్‌ లైఫ్‌ రిజర్వులో సిమోన్‌నీహాం అనే ఫొటోగ్రాఫర్‌ క్లిక్‌మనిపించారు. ఆ సింహం అక్కడ కేవలం కొన్ని క్షణాలపాటే నిల్చుందట.. అంతలో మనోడు క్లిక్‌మనిపించాడు. ‘సింహాన్ని అడవికి రాజు అని ఎందుకంటారో ఈ చిత్రాన్ని చూస్తే తెలుస్తుంది’ అని సిమోన్‌ అన్నారు.   


కేవలం 30 అడుగుల దూరం నుంచే సింహాన్ని తన కేనన్‌ 1 డీఎక్స్‌ మార్క్‌ 2 కెమెరాతో ఫొటో తీసినట్టు వెల్లడించారు. ‘ఈ ఫొటోను చూసినవాళ్లు తమకు తోచిన వ్యాఖ్యానాలు చేశారు. కానీ నాకు మాత్రం.. తన రాజ్యాన్ని స్వయంగా పర్యవేక్షించేందుకు వచ్చిన మృగరాజులా కనిపించింద’ని 52 ఏళ్ల సిమోన్‌ పేర్కొన్నారు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top