న్యూఢిల్లీ: అంతర్యుద్ధంలో దెబ్బతిన్న సూడాన్‌లో భారీగా రక్తపాతం జరిగినట్లు అంతరిక్షం నుండి వెలువడిన దృశ్యాలు స్పష్టం చేస్తున్నాయి. యేల్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌కు చెందిన హ్యుమానిటేరియన్ రీసెర్చ్ ల్యాబ్ (హెచ్‌ఆర్‌ఎల్) విడుదల చేసిన ఉపగ్రహ చిత్రాల్లో గత వారంలో ఎల్ ఫాషర్‌ను స్వాధీనం చేసుకున్న తర్వాత తిరుగుబాటు సంస్థ సామూహిక హత్యలకు పాల్పడినట్లు తెలుస్తోంది.
రెండు సంవత్సరాలకు పైగా సాగుతున్న అంతర్యుద్ధంలో సూడాన్ అతలాకుతలమైంది. సుడానీస్ ఆర్మీ, రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (ఆర్‌ఎస్‌ఎఫ్) మధ్య యుద్ధం 2023 ఏప్రిల్‌లో మొదలయ్యింది. గతంలో అధికారాన్ని పంచుకున్న ఈ రెండు యూనిట్లు ప్రజాస్వామ్యం వైపు మళ్లే సమయంలో, తమ బలగాలను ఏకీకృతం చేసే ప్రణాళికల విషయంలో విఫలమయ్యాయి. అక్టోబర్ 26న, ఉత్తర డార్ఫర్‌లోని ఎల్-ఫాషర్ నగరంలోని ఆర్మీ ప్రధాన కార్యాలయాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఆర్‌ఎస్‌ఎఫ్ తెలిపింది. ఐక్యరాజ్యసమితి (యూఎన్) తెలిపిన వివరాల ప్రకారం ఈ అంతర్యుద్ధంలో దాదాపు 40 వేల మంది మృతి చెందారు. లక్షలమంది నిరాశ్రయులయ్యారు.
🚨HUMAN SECURITY EMERGENCY🚨
El-Fasher has fallen to RSF. HRL finds evidence of mass killings including door-to-door clearance operations and objects consistent with reported bodies on berm entrapping El-Fasher.#KeepEyesOnSudan
🛰️@AirbusSpace @Maxarhttps://t.co/1HApllgNL5 pic.twitter.com/yrCbM5HxeP— Humanitarian Research Lab (HRL) at YSPH (@HRL_YaleSPH) October 27, 2025
సూడాన్‌లో సగం మందికిపైగా ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. దేశవ్యాప్తంగా వ్యాధులు చుట్టుముట్టాయి. సోమవారం ప్రచురితమైన ఒక నివేదికలో ఎల్-ఫాషర్‌లోని దరాజా ఔలా పరిసరాల్లో వ్యూహాత్మకంగా మోహరించిన ఆర్‌ఎస్‌ఎఫ్ వాహనాలను హెచ్‌ఆర్‌ఎల్ గమనించింది. చిత్ర విశ్లేషణలో ఆర్‌ఎస్‌ఫ్ వాహనాల దగ్గర నేలపై పడివున్న మానవ శరీరాల పరిమాణానికి అనుగుణంగా ఉన్న వస్తువులు ఉన్నాయని తెలుస్తోంది. వీటిలో ఐదు ఎర్రటి రంగులో కనిపిస్తున్నాయి. ఆర్‌ఎస్‌ఎఫ్ సెప్టెంబర్ 19న డ్రోన్‌లతో దాడి చేసి దాదాపు 78 హత్య చేసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం యేల్ హెచ్‌ఆర్‌ఎల్.. ఎల్-ఫాషర్ నుండి పారిపోతున్న సమయంలో పౌరులు మరణించడాన్ని కూడా కనుగొంది. ఈ ప్రాంతం పూర్తిగా ఆర్‌ఎస్‌ఎఫ్ ఆధీనంలో ఉంది. వారి కార్యకలాపాల స్థావరంగా దీనిని ఉపయోగిస్తున్నారని యేల్ తన నివేదికలో పేర్కొంది.
ఇది కూడా చదవండి: Varanasi: ఉమ్మినా.. కుక్క మలాన్ని కడగకున్నా..


