Sakura Pink Diamond Auction Price Record: పర్పుల్-పింక్ డైమండ్ హాంగ్‌కాంగ్‌లో వేలం వేయగా 213 కోట్లు పలికింది - Sakshi
Sakshi News home page

వైరల్‌: వేలంలో 213 కోట్లు పలికిన ‘‘ది సాకురా’’

May 26 2021 12:50 PM | Updated on May 26 2021 7:30 PM

The Sakura Diamond Sets Record For Largest Ever To Be Auctioned In Hong Kong - Sakshi

హాంగ్‌కాంగ్‌: వేలం పాటలో వజ్రాలకు అత్యధిక ధర పలకడం తెలిసిందే. అయితే తాజాగా పర్పుల్-పింక్ డైమండ్  ‘ది సాకురా’ను హాంగ్‌కాంగ్‌లో వేలం వేయగా 213 కోట్లు పలికింది. 15.81 క్యారెట్ల ఈ డైమండ్‌ను ఆసియాలోని ఓ బడా వ్యాపారి సొంతం చేసుకున్నట్లు సమాచారం. ‘ది సాకురా’ తో పాటు, గుండె ఆకారంలో ఉన్న మరో 4.2 క్యారెట్ల గులాబీ వజ్రాల ఉంగరాన్ని 6.6 మిలియన్‌ డాకర్లకు ‘ది స్వీట్ హార్ట్’ పేరుతో వేలం వేశారు. కాగా ‘ది సాకురా’ పింక్‌ డైమండ్‌ 29.3 మిలియన్‌ డాలర్లు పలికింది.

జెనీవాలో గత నవంబర్‌లో ‘ది సాకురా’ అనే 14.8 క్యారెట్ల పర్పుల్-పింక్ డైమండ్  ‘ది స్పిరిట్ ఆఫ్ ది రోజ్’ వేలంలో 27 మిలియన్‌ డాలర్లకు అమ్ముడుపోయింది. అలాగే దోషనివారణ ఓవల్ రత్నం "ది స్పిరిట్ ఆఫ్ ది రోజ్" 23-38 మిల్లియన్ డాలర్లు పలికినట్లు అంచనా. 

కాగా దీనిపై క్రిస్టీ వేలం సంస్థ స్పందిస్తూ.."ఈ రోజు ఆభరణాల వేలం చరిత్రలో మరో ముఖ్యమైన అధ్యాయాన్ని ‘‘ది సాకురా’’ నమోదు చేసింది. వేలంలో రికార్డ్‌ స్థాయిలో పలికిన ధర పట్ల మేము చాలా సంతోషిస్తున్నాం. అలాగే ​అత్యుత్తమ పింక్ వజ్రాలను అందించే క్రిస్టీ సంప్రదాయాన్ని కొనసాగిస్తాం." అని ఓ ప్రకటనలో తెలిపారు.

(చదవండి: సెకండ్‌ వేవ్‌: మళ్లీ 2 లక్షలు దాటిన కరోనా కేసులు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement