
కీవ్: రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం మరోసారి పీక్ స్టేజ్‌కు చేరుకుంది. తాజాగా ఉక్రెయిన్ నావికా దళానికి చెందిన అతి పెద్ద నిఘా నౌక సింఫెరోపోల్‌ను రష్యా ధ్వంసం చేసింది. సముద్ర డ్రోన్ సాయంతో నౌకను రష్యా విజయవంతంగా కూల్చివేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వివరాల ప్రకారం.. ఉక్రెయిన్ నావికాదళానికి చెందిన అతి పెద్ద నిఘా నౌక సింఫెరోపోల్ దశాబ్ద కాలంగా ఉక్రెయిన్ నేవీకి సేవలు అందిస్తోంది. ఇందులో ఉక్రెయిన్‌కు సంబంధించిన నిఘా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. కాగా, సింఫెరోపోల్‌ను టార్గెట్ చేసిన రష్యా నౌకను ధ్వంసం చేసింది. సముద్ర డ్రోన్ సాయంతో రష్యా దళాలు.. నౌకను ధ్వంసం చేశాయి. అయితే, సముద్ర డ్రోన్‌ను రష్యా విజయవంతంగా ఉపయోగించడం ఇదే తొలిసారి అని నిపుణులు చెబుతున్నారు.
ఇక, నౌకపై దాడి కారణంగా అందులో ఉన్న రేడియో, ఎలక్ట్రానిక్, రాడార్, ఆప్టికల్ నిఘా విభాగానికి ఎదురుదెబ్బ తగిలింది. మరోవైపు.. రష్యా దాడిని ఉక్రెయిన్ అధికారులు ధృవీకరించారు. ఈ దాడిలో ఒక సిబ్బంది మరణించగా, అనేక మంది గాయపడ్డారని ఉక్రేనియన్ నేవీ ప్రతినిధి చెప్పుకొచ్చారు. ఈ దాడి తర్వాత ఉక్రెయిన్ దళాలు అప్రమత్తమైనట్టు తెలుస్తోంది. ఇక, రష్యాడ్రోన్ దాడికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

🚨⚡️ BREAKING:
Russia Unleashes Kamikaze Sea Drones.
An unmanned suicide boat from the Black Sea Fleet has just sent the Ukrainian reconnaissance ship "Simferopol" to the bottom at the mouth of the Danube.
A new era of naval warfare is here.. 🇷🇺🔥 pic.twitter.com/OnOiHR0LsJ— RussiaNews 🇷🇺 (@mog_russEN) August 28, 2025