
డెమాస్కస్: సిరియాలో కల్లోలిత దరా ప్రావిన్స్‌లో రోడ్డు పక్కన అమర్చిన బాంబు పేలిన ఘటనలో ఏడుగురు చిన్నారులు చనిపోగా మరో ఇద్దరు గాయపడ్డారు. బాంబు పేలుడుకు బాధ్యులెవరో తెలియా ల్సి ఉంది.
ఈ ఏడాదిలో ఇప్పటి వరకు దరా ప్రావిన్స్‌లో జరిగిన వివిధ ఘటనల్లో 100 మందికి పైగా చనిపో యారు. ఇజ్రాయెల్ ఆక్రమిత గొలాన్ హైట్స్, జోర్డాన్‌కు మధ్యలో దరా ప్రావిన్స్ ప్రాంతముంది. సిరియాలో 2011లో అంతర్యుద్ధానికి బీజం పడిందిక్కడే.