వైరల్‌ వీడియో: బర్త్‌ డే పార్టీ లో సింహాం చీఫ్ గెస్ట్

Pakistani Influencer Uses Sedated Lion As Birthday Party Prop  - Sakshi

ఇస్లామాబాద్‌: ఎక్కడైనా బర్త్‌ డే పార్టీ అంటే సాధారణంగా మన స్నేహితులు, కుటుంబ సభ్యులు, బంధువులను ను ఆహ్వనిస్తాము. కానీ పాకిస్థాన్ చెందిన  ఓ మహిళ మాత్రం ఏకంగా సింహాన్ని ముఖ్య అతిధి గా తీసుకు వచ్చింది. ఈ మృగరాజుని కుర్చీలో కూర్చోబెట్టి చైన్లతో కట్టేసింది. సుసాన్ ఖాన్ అనే మహిళ లాహోర్ లోని ఓ హోటల్ లో జన్మదిన వేడుక జరుపుకుంది. అయితే  బర్త్‌ డే పార్టీ కు సంభందిచిన ఓ వీడియో ను  సుసాన్ ఖాన్  తన  ఇన్ స్టాగ్రామ్‌ లో పోస్ట్‌ చేసింది. ఆ వీడియోలో ఓ సింహాన్ని గొలుసులతో కట్టేసి కుర్చీలో కూర్చోబెట్టారు. కొందరు ఆటలు ఆడుతున్నారు. ఈ  వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఆమె చిక్కుల్లో పడింది. సుసాన్ ఖాన్  తన  ఇన్ స్టాగ్రామ్‌ పోస్ట్‌ చేసిన వీడియో  ప్రొటెక్ట్ సేవ్ యానిమల్స్ ప్రతినిధుల కంటపడింది. దీంతో వారు ఈ వీడియోను తమ ఇన్ స్టా అకౌంట్ లో పోస్ట్ చేసి సుసాన్ ఖాన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

మేము  బర్త్‌ డే పార్టీలకు వ్యతిరేకం కాదు..కానీ ఇలా మీరు మూగజీవాలను పార్టీలకు తీసుకొచ్చి కట్టేసి ఇలా ఆనందం పొందడం తప్పు. మిమ్మల్ని కూడా పార్టీకి తీసుకెళ్లి మత్తుమందు ఇచ్చి ఇలానే ఓ కూర్చీ కి కట్టిపడేస్తే మీకు కూడా తెలుస్తుందని వీడియోకు కామెంట్ ట్యాగ్ చేశారు. అయితే ఈ వేడుకలో సింహానికి మత్తుమందు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఇక వీడియోపై విమర్శలు  రావడంతో పోస్ట్ చేసిన 24 గంటల్లో దానిని సుసాన్ ఖాన్ డిలీట్ చేసింది. అయితే ఆ మహిళతోపాటు ఆ పార్టీలో ఉన్నవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చాలామంది నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.క ఇదే విషయంపై వన్యప్రాణుల సంరక్షణ సంఘం ప్రతినిధులు ఓ ఆన్‌లైన్ పిటిషన్ వేసేందుకు సిద్ధమయ్యారు. వేడుకల్లో వన్యప్రాణులను ఉపయోగించకూడదని ఆన్‌లైన్ వేదికగా 1500 సంతకాలు సేకరించారు.

చదవండి: సరిహద్దులు దాటిన ప్రేమ..చివరికి ఏమైందంటే?
 

 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top