ఇమ్రాన్‌ ఖాన్‌కు మరో షాక్‌.. అవినీతి కేసులో 14 ఏళ్ల జైలు శిక్ష | Sakshi
Sakshi News home page

ఇమ్రాన్‌ ఖాన్‌కు మరో షాక్‌.. అవినీతి కేసులో 14 ఏళ్ల జైలు శిక్ష

Published Wed, Jan 31 2024 12:46 PM

Pakistan Ex PM Imran Khan Wife Get 14 Years Jail In Corruption Case - Sakshi

పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. మరో వారం రోజుల్లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి మళ్లీ అధికార పగ్గాలు చేపట్టాలనితీవ్రంగా ప్రయతిస్తున్న ఇమ్రాన్‌కు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే అధికార రహస్య పత్రాల లీకేజీ కేసులో ఆయనతో పాటు మాజీ విదేశాంగ మంత్రి మహ్మూద్‌ ఖురేషీకి పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ ప్రత్యేక కోర్టు జడ్జి అబ్దుల్‌ హస్నత్‌ మంగళవారం తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. 

తాజాగా ఇమ్రాన్‌కు మరోషాక్‌ తగిలింది. తోషాఖానా కేసులో ఇస్లామాబాద్ కోర్టు ఆయ‌నకు బుధవారం 14 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఈ కేసులో ఆయ‌న భార్య బుస్రా బీబీకి కూడా 14 ఏళ్ల శిక్ష‌ను విధించింది. అంతేగాక ఇద్దరూ ప‌దేళ్ల పాటు ఎన్నిక‌ల్లో పాల్గొన‌కుండా అన‌ర్హ‌త వేటు కూడా వేసింది. సుమారు రూ.1.5 బిలియ‌న్లు జ‌రిమానా క‌ట్టాల‌ని కోర్టు ఆదేశించింది.

ఇమ్రాన్‌ ఖైదీగా ఉన్న రావల్పిండిలోని అడియాలా జైలులో ఈ కేసు విచారణ జరిగింది. కాగా గత ఆగస్టు నుంచి ఇమ్రాన్‌ జైలులోనే ఉన్నారు. ఆయనపై వివిధ నేరాల కింద దాదాపు 100కుపైగా కేసులు నమోదైనట్లు సమాచారం. 
చదవండి: Imran Khan Jailed: ఇమ్రాన్‌కు పదేళ్ల జైలు

Advertisement
Advertisement