
కరాచీ: ఇరాన్‌పై అమెరికా దాడులకు దిగడాన్ని పాకిస్తాన్ ఖండించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ప్రశంసలతో ముంచెత్తిన తర్వాతే రోజే ఇరాన్‌పై అగ్రరాజ్యం దాడులకు దిగడాన్ని పాకిస్తాన్ వ్యతిరేకించింది. నోబెల్ శాంతి పురస్కరానికి డొనాల్డ్ ట్రంప్ అన్ని విధాలా అర్హుడేనని పాక్ ప్రకటించిన రోజు వ్యవధిలోనే.. ఇరాన్‌పై బాంబుల వర్షం కురిపించిన అమెరికా వైఖరిని పాక్ తప్పుబట్టింది. ఈ మేరకు ఇరాన్‌పై అమెరికా దాడులు చేయడాన్ని ఖండిస్తున్నట్లు పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రకటన ద్వారా స్పష్టం చేసింది. ఇది ఎంతమాత్రం సమంజసం కాదని ‘ఎక్స్’ లో పేర్కొంది పాక్ విదేశాంగ మంత్రిత్వ శాఖ.
🔊PR No.1️⃣8️⃣2️⃣/2️⃣0️⃣2️⃣5️⃣
Pakistan Condemns the US Attacks on the Nuclear Facilities of the Islamic Republic of Iran.
🔗⬇️https://t.co/2qpo27WzVQ pic.twitter.com/ugtFomQ5HO— Ministry of Foreign Affairs - Pakistan (@ForeignOfficePk) June 22, 2025
డొనాల్డ్ ట్రంప్‌కు ‘నోబెల్ శాంతి’ ఇవ్వాల్సిందే..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు వచ్చే ఏడాది నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని కోరుతూ ఆయన పేరును అధికారికంగా ప్రతిపాదించాలని నిర్ణయించినట్లు పాకిస్తాన్ ప్రభుత్వం శనివారం(జూన్ 21వ తేదీ) వెల్లడించింది. ఇటీవల నిర్ణయాత్మక దౌత్యపరమైన జోక్యంతో భారత్–పాకిస్తాన్ ఘర్షణ ఆగేలా ట్రంప్ కృషి చేశారని, అందుకు నోబెల్ శాంతి బహుమతికి ఆయన అర్హుడేనని తేల్చిచెప్పింది. అయితే నాలుగురోజుల క్రితం ట్రంప్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌కు వైట్‌హౌస్‌లో విందు ఇచ్చిన సంగతి తెలిసిందే.
ట్రంప్‌కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని ఆ సమయంలో అసిమ్ మునీర్ విజ్ఞప్తి చేశారు. తాజాగా పాక్ ప్రభుత్వం అధికారికంగా దీనిపై ప్రకటన చేసింది. భారత్–పాక్ మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న సమయంలో డొనాల్డ్ ట్రంప్ వ్యూహాత్మకంగా వ్యవహరించారని, ఇరు దేశాలతో మాట్లాడి శాంతికోసం కృషి చేశారని పేర్కొంది. అణ్వ్రస్తాలు కలిగిన రెండు దేశాల మధ్య యుద్ధం జరగకుండా నివారించారని కొనియాడింది. భారత్–పాక్ మధ్య అమల్లోకి వచి్చన కాల్పుల విరమణకు ట్రంప్ చొరవే కారణమని తెలిపింది.
మరి ఇప్పుడు అదే ట్రంప్.. ఇరాన్‌పై దాడులకు దిగడంతో పాకిస్తాన్ ఉలిక్కిపడింది. కొన్ని దేశాల మధ్య శాంతి ఒప్పందానికి ట్రంప్ కారణమయ్యారని నిన్న, మొన్నటి దాకా భావించిన పాక్.. ఇరాన్‌పై అమెరికా యుద్ధాన్ని ఖండించింది. ట్రంప్ నోబెల్ శాంతి పురస్కారానికి అర్హుడని అనుకున్న వేళ.. ఆయన ఇరాన్‌పై యుద్ధానికి సిద్ధం కావడంతో ఇలా జరిగేందటనే భావనలో పడింది పాక్. తమకేదో సాయం చేశాడని నోబెల్‌కు సిఫార్సు చేద్దామనుకుంటే.. ట్రంప్ ఇలా చేశారేంటని అనుకోవడం ఇప్పుడు పాక్ వంతైంది. తాము ఓ అధికార ప్రకటన చేసిన రోజు వ్యవధిలోనే ట్రంప్ ‘ఎంత పని చేశారు’ అని తలలు పట్టుకోవడే తప్పితే ఏమీ చేసేది లేకుండా పోయినట్లైంది పాక్ పరిస్థితి.
ఇదీ చదవండి: