‘హెచ్‌–1బీ’ గ్రేస్‌ పీరియడ్‌ 12 నెలలకు పెంచాలి | Online Petition Launched In US To Extend Grace Period For H1b visa | Sakshi
Sakshi News home page

‘హెచ్‌–1బీ’ గ్రేస్‌ పీరియడ్‌ 12 నెలలకు పెంచాలి

Published Fri, Feb 10 2023 6:33 AM | Last Updated on Fri, Feb 10 2023 6:33 AM

Online Petition Launched In US To Extend Grace Period For H1b visa - Sakshi

వాషింగ్టన్‌: అగ్రరాజ్యం అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ కంపెనీల్లో లే–ఆఫ్‌ల పర్వం కొనసాగుతోంది. మరోవైపు ఇతర రంగాల్లోనూ పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు ఊడిపోతున్నాయి. ఫలితంగా అమెరికాలో ఉంటున్న భారతీయులు నిరుద్యోగులుగా మారుతున్నారు. హెచ్‌–1బీ(నాన్‌–ఇమ్మిగ్రెంట్‌) వీసాపై ఉంటున్నవారు ఉద్యోగం పోయాక 60 రోజుల్లోగా(2 నెలలు) మరో కొలువు వెతుక్కోవాలి. లేకపోతే స్వదేశానికి వెళ్లిపోవాలి.

ఈ గ్రేస్‌ పిరియడ్‌ను 60 రోజుల నుంచి 12 నెలలకు(ఒక సంవత్సరం) పెంచాలని కోరుతూ ఫౌండేషన్‌ ఫర్‌ ఇండియా, ఇండియన్‌ డయాస్పోరా స్టడీస్‌ అండ్‌ గ్లోబల్‌ టెక్నాలజీ ప్రొఫెషనల్స్‌ అసోసియేషన్‌ అనే రెండు భారత–అమెరికన్‌ సంస్థలు పోరాటం ప్రారంభించాయి. భారత టెకీలకు మేలు చేసేలా నిర్ణయం తీసుకోవాలంటూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు ఆన్‌లైన్‌లో పిటిషన్లు సమర్పిస్తున్నాయి. అధ్యక్షుడితోపాటు డిపార్టుమెంట్‌ ఆఫ్‌ హోంల్యాండ్‌ సెక్యూరిటీ కార్యదర్శి, యూఎస్‌ సిటిజెన్‌షిప్, ఇమ్మిగ్రేషన్‌ సర్వీసెస్‌ డైరెక్టర్‌కు ఆన్‌లైన్‌లో పిటిషన్లను పంపిస్తున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement