ఇరాన్‌పై దాడులకు నాటో చీఫ్‌ పూర్తి మద్దతు | NATO Chief Backs Strikes on Iran | Sakshi
Sakshi News home page

ఇరాన్‌పై దాడులకు నాటో చీఫ్‌ పూర్తి మద్దతు

Mar 26 2026 9:01 PM | Updated on Mar 26 2026 9:34 PM

NATO Chief Backs Strikes on Iran

ఇరాన్‌పై దాడులకు నాటో సెక్రటరీ జనరల్‌ మార్క్ రుట్టే పూర్తి మద్దతు ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చర్యలను బహిరంగంగా సమర్థించారు. ఇరాన్‌ అణు, క్షిపణి కార్యక్రమాలతో ఐరోపా భద్రతకు ముప్పు పొంచి ఉందని తెలిపారు. 

కాగా, డొనాల్డ్ ట్రంప్ ఇటీవల నాటోపై విమర్శలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై నాటో కార్యదర్శి జనరల్ మార్క్ రుట్టే ప్రతిస్పందిస్తూ.. పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంక్షోభంలో కూటమి పాత్రను సమర్థించారు. ఆ ప్రాంతంలో ఇటీవల చేపట్టిన సైనిక చర్యలను ప్రస్తావించారు.

రుట్టే తెలిపిన వివరాల ప్రకారం.. యుద్ధం సమయంలో టర్కీ వైపు దూసుకెళ్తున్న మూడు బాలిస్టిక్ క్షిపణులను నాటో అడ్డుకుంది. అంతేకాదు, హార్మూజ్ జలసంధి అంతర్జాతీయ నౌకాయానానికి సురక్షితంగా ఉండేలా చర్యలు తీసుకుంటోంది.

మార్క్ రుట్టే చేసిన వ్యాఖ్యలు ట్రంప్ ట్రూత్ సోషల్‌లో చేసిన పోస్టు తర్వాత వచ్చాయి. ట్రంప్‌ నాటోను విమర్శిస్తూ ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధంతో తమకు మద్దతు ఇవ్వకపోవడాన్ని అమెరికా మర్చిపోదని చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement