తగిన మోతాదులో ఆల్కహాల్‌తో గుండెకు మేలు

Moderate Intake Of Alcohol Cuts The Risk Of Heart Disease By 20 Percent - Sakshi

వాషింగ్టన్‌ : తగిన మోతాదులో ఆల్కహాల్‌ తీసుకోవటం ద్వారా మేజర్‌ గుండె జబ్బుల నుంచి 20 శాతం తప్పించుకునే అవకాశం ఉందని తాజా పరిశోధనల్లో తేలింది. ప్రతి రోజు మహిళలు 18 మిల్లీలీటర్లు, పురుషులు 32 మిల్లీలీటర్ల ఆల్కహాల్‌ తీసుకోవటం ద్వారా కార్డియోవాస్క్యులర్‌ డిసీజెస్‌( గుండె సంబంధ వ్యాధులు) వచ్చే అవకాశం 20శాతం తగ్గుతుందని హార్వర్డ్‌ మెడికల్‌ స్కూల్‌కు చెందిన శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దాదాపు 50 వేల మందిపై పరిశోధనలు జరిపిన వీరు ఈ విషయాన్ని ధ్రువీకరించారు. 18 మిల్లీలీటర్ల కంటే తక్కువ మోతాదులో ఆల్కహాల్‌ తీసుకున్న వారిలో గుండె సంబంధిత వ్యాధులు పెరిగాయని తేల్చారు.

ఆల్కహాల్‌ తీసుకున్న వారిలో కంటే తీసుకోని వారి మెదడులో ఒత్తిడికి సంబంధించిన కార్యకలాపాలు అధికంగా ఉన్నాయని వెల్లడించారు. అంతేకాకుండా ఒక వారంలో 250 మిల్లీలీటర్ల కంటే ఎక్కువ మోతాదులో ఆల్కహాల్‌ తీసుకున్న వారి మెదడులో ఒత్తిడికి సంబంధించిన కార్యకలాపాలు అత్యంత అధికంగా ఉన్నాయని తెలిపారు. అయితే తాము ఆల్కహాల్‌ అలవాటును ప్రోత్సహించటం లేదని, తగిన మోతాదులో తీసుకుంటే లాభం ఉంటుందని మాత్రమే చెబుతున్నామని అన్నారు. ఆల్కహాల్‌ తీసుకోవటం వల్ల క్యాన్సర్‌, లివర్‌ డ్యామేజ్‌ వంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉంటాయని వెల్లడించారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top