9 గంటల్లో 51 పబ్‌లు చుట్టి.. ప్రతీ పబ్‌లోనూ డ్రింక్‌ తీసుకుని

Man Visits 51 Pubs In Less Than 9 Hours Submits For Guinness - Sakshi

బ్రిటన్‌: పబ్‌కి వెళ్లి తాగకుండా ఉండటమనేది సాధారణంగా జరగదు. కానీ ఇక్కడ ఒక 48 ఏళ్ల వ్యక్తి తాను ఒక్కో రోజులో 51 పబ్‌లకి వెళ్లి కనీసం ప్రతీ పబ్‌ వద్ద 125 మి.లీ డ్రింక్‌ తీసుకుని రికార్డు సృష్టించాడు. ఇంతకి అతనెవరనే కదా! అసలు విషయంలోకి వెళ్లితే కోవిడ్‌-19 దృష్ట్య పబ్‌లకి జనాలు దూరంగా ఉండటంతో ఆ వ్యాపారాలు కాస్త దెబ్బతిన్నయన్న సంగతి తెలిసిందే.

(చదవండి: అక్కడ తాగే నీటిలో అత్యధిక స్థాయిలో డీజిల్‌, కిరోసిన్‌ ఉన్నాయట!)

ఇలాంటి సమయంలో అందరి దృష్టిని ఆకర్షించేలా కావాలనే పబ్‌లకి వెళ్లానంటున్నాడు యూకేకి చెందిన మ్యాట్‌ ఎల్లిస్‌. అంతేకాదు కేవలం ఒక్కరోజులోనే ఎనిమిది గంటల 52 నిమిషాల్లో  51 పబ్‌లు చుట్టి వచ్చాడు. ఈ క్రమంలో అతను ఆరోగ్య రీత్యా ప్రతి పబ్‌లోనూ కేవలం 125 మిల్లీ లీటర్ల  మాత్రమే ఆల్కహాల్‌ తీసుకున్నట్లు చెప్పుకొచ్చాడు. ఇందులో జ్యూస్‌, డైట్‌ కోక్‌ మిక్స్‌ చేసి డ్రింక్‌ తీసుకున్నాడు. ఓవరాల్‌గా పబ్‌లను చుట్టొచ్చే సమయంలో ఓవరాల్‌గా 6.3 లీటర్లు ఆల్కాహల్‌ తీసుకున్నాడట. దీనికి గిన్నిస్‌ వరల్డ్‌ ఇద్దరు స్వతంత్ర ప్రతినిధుల్ని నియమించి అతన్ని పర్యవేక్షించింది. 

ఈ ఏడాది చాలా భయంకరమైనదని,  పబ్‌ల నుంచి ప్రజలను దూరం చేయడమే కాక అందరూ ఆనందంగా వారాంతాల్లో గడిపే అవకాశం లేకుండా చేసిందంటూ తన అసహనం వ్యక్తం చేశాడు. ఈ మేరకు తాను వరల్డ్‌ రికార్డుకి దరఖాస్తు చేసుకున్నట్లు కూడా తెలిపాడు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఎల్లిస్ రికార్డును ధృవీకరిస్తే మాత్రం ఇలాంటి ఘనత సాధించిన మొట్ట మొదటి వ్యక్తిగా ఎల్లిస్‌ నిలుస్తాడు.

(చదవండి: అతను కూడా నాలాగే ఆమెను ప్రేమిస్తున్నాడు)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top