స్వల్ప అస్వస్థతకు గురైన బైడెన్‌

Joe Biden Suffers Hairline Fracture In Foot Doctor Says - Sakshi

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డెమొక్రాట్‌ జో బైడెన్‌ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. పెంపుడు కుక్కతో ఆడుకుంటున్న సమయంలో ఆయన తూలి కిందపడోయారు. దీంతో కుడిపాదం బెణికిన కారణంగా నడవడానికి ఆయన ఇబ్బంది పడుతున్నారని బైడెన్‌ కార్యాలయం ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. శనివారం ఈ ఘటన చోటుచేసుకున్నట్లు వెల్లడించింది. ఈ క్రమంలో ఆదివారం ఆర్థోపెడిస్ట్‌ను సంప్రదించి ఎక్స్‌రే, సీటీ స్కాన్‌ చేయించగా, స్వల్పంగా ఫాక్చర్‌ అయినట్లు తేలిందని పేర్కొంది. ఇక ఈ విషయంపై బైడెన్‌ వ్యక్తిగత ఫిజీషియన్‌ కెవిన్‌ ఓ కానర్ స్పందించారు.(చదవండి: బైడెన్‌ సరికొత్త చరిత్ర.. కానీ ఆనాడు)

ఫాక్చర్‌ కారణంగా బైడెన్‌ కొన్నివారాల పాటు వాకింగ్‌ బూట్‌ ధరించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కాగా జో బైడెన్‌ చేతిలో ఓటమి పాలైన రిపబ్లికన్‌ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌.. బైడెన్‌ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. ఇక గత శుక్రవారం 78వ వసంతంలో అడుగుపెట్టిన బైడెన్‌... తద్వారా అగ్రరాజ్య అధ్యక్షులలో అత్యంత ఎక్కువ వయస్సు కలిగిన ప్రెసిడెంట్‌గా చరిత్రకెక్కనున్నారు. అయితే అత్యధిక వయసులో ఆయన ఎంత వరకు బాధ్యతలు సక్రమంగా నిర్వహించగలరన్న అంశంపై మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ ఆది నుంచి విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికీ ఓటమిని అంగీకరించేందుకు సుముఖంగా లేని ఆయన, బైడెన్‌ అధికారం చేపట్టినా ఎక్కువ రోజులు పదవిలో కొనసాగలేరంటూ ఎన్నికల ప్రచారంలో వ్యాఖ్యానించారు. ‌

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top