ఇజ్రాయెల్‌కు బిగ్‌ షాక్‌!.. ఇరాన్‌ పవర్‌ఫుల్‌ అటాక్‌ | Iran Missile strikes Israel Dimona nuclear research site | Sakshi
Sakshi News home page

ఇజ్రాయెల్‌కు బిగ్‌ షాక్‌!.. ఇరాన్‌ పవర్‌ఫుల్‌ అటాక్‌

Mar 22 2026 9:00 AM | Updated on Mar 22 2026 9:05 AM

Iran Missile strikes Israel Dimona nuclear research site

జెరూసలేం: ఇరాన్‌పై ఇజ్రాయెల్‌-అమెరికా దాడుల నేపథ్యంలో పశ్చిమాసియాలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. పరస్పర దాడులతో ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. తాజాగా ఇజ్రాయెల్ అణు పరిశోధన కేంద్రం టార్గెట్‌గా ఇరాన్‌ భీకర క్షిపణి దాడులు చేసింది. దీంతో, ఇజ్రాయెల్‌కు భారీ నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది. ఇక, ఇరాన్‌ దాడులపై ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు స్పందిస్తూ హెచ్చరికలు జారీ చేశారు.

ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ క్షిపణి దాడులతో విరుచుకుపడుతోంది. ఇజ్రాయెల్ అణు పరిశోధన కేంద్రం సమీపంలోని డిమోనా, అరద్‌ ప్రాంతాలపై ఇరాన్ క్షిపణులతో దాడి చేసింది. అయితే, డిమోనా ప్రాంతంలో ఇజ్రాయెల్‌కు కీలకమైన అణు కేంద్రం ఉండటం వల్ల భద్రతా ఆందోళనలు పెరిగాయి. ఇక, ఈ ఘటనలో పిల్లలు సహా 100మందికి పైగా గాయపడినట్లు ఇజ్రాయెల్‌ అధికారులు వెల్లడించారు. ఈ సందర్బంగా ఇజ్రాయెల్ విదేశాంగ శాఖ స్పందించింది. ఇరాన్ క్షిపణులు నేరుగా పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడి చేశాయని పేర్కొంది. దీని వల్ల అరుద్, డిమోనా ప్రాంతాలు ధ్వంసమయ్యాయని, 100 మందికిపైగా గాయపడ్డారని తెలిపింది. దీనిని ఉగ్రవాద చర్య, యుద్ధ నేరంగా అభివర్ణించింది.  

 

నెతన్యాహు హెచ్చరిక.. 
మరోవైపు ఇరాన్ క్షిపణి దాడిపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు తీవ్రంగా స్పందించారు. గాయపడిన వారికి తక్షణ సహాయం అందించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా నెతన్యాహు..‘ఇది మన భవిష్యత్తుకు సంబంధించిన కఠిన సమయం. గాయపడిన వారందరికీ ప్రార్థనలు చేస్తున్నాం. అన్ని రంగాల్లో శత్రువులను ఎదుర్కొంటాం. శత్రువులపై అన్ని రంగాల్లో ప్రతిదాడులు కొనసాగిస్తాం’ అని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఘటనా స్థలంలో పనిచేస్తున్న అత్యవసర సేవా బృందాలకు నెతన్యాహూ అభినందనలు తెలిపారు. ప్రజలు ప్రభుత్వ సూచనలు తప్పనిసరిగా పాటించాలని పిలుపునిచ్చారు. అలాగే, దాడి జరిగిన ప్రాంతం నుంచి సుమారు 150 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు.

ఇరాన్‌ ఝలక్‌.. 
ఇజ్రాయెల్‌పై దాడుల నేపథ్యంలో ఇరాన్‌ ఐఆర్​జీసీ ఏరోస్పేస్ ఫోర్స్ అధిపతి మేజర్ జనరల్ సయ్యద్ మజీద్ మూసావి స్పందించారు. ఇజ్రాయెల్ గగనతలం రక్షణ లేకుండా ఉంది. ఇజ్రాయెల్ ఆక్రమిత ప్రాంతాల ఆకాశంపై ఇరాన్‌ మిసైల్ ఆధిపత్యం కొనసాగుతోంది. ఇకపై జరగబోయే దాడులు అమెరికా-ఇజ్రాయెల్ కమాండర్లను ఆశ్చర్యపరుస్తాయని అన్నారు. కొత్త వ్యూహాలతో ముందుకు వస్తున్నట్లు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement