breaking news
Nuclear center
-
అది ఫేక్ న్యూస్.. నమ్మొద్దు: ట్రంప్
ఇరాన్ (Iran)లోని మూడు అణుకేంద్రాలు లక్ష్యంగా అమెరికా (USA) ఆదివారం(జూన్ 22న) ప్రత్యక్షంగా దాడులు చేసిందన్నది తెలిసిందే. అయితే, ఈ దాడుల్లో ఇరాన్‌కు జరిగిన నష్టం గురించి పెంటగాన్‌కు చెందిన డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (DIA) ఓ నివేదిక తయారుచేసింది. ఈ నివేదికల్లోని విషయాలు పలు మీడియాల్లో కథనాలుగా వెలువడగా.. ఇప్పుడవి తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఈ నివేదికలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. అవి నకిలీ వార్తలని పేర్కొన్న ఆయన.. చరిత్రలో అత్యంత విజయవంతమైన సైనిక దాడుల తీవ్రతను తగ్గించే ప్రయత్నం ఇదన్నారు. ‘నకిలీ వార్తలు. చరిత్రలో అత్యంత విజయవంతమైన సైనిక దాడుల తీవ్రతను తగ్గించేందుకు కొన్ని వార్తా సంస్థలు చేస్తున్న ప్రయత్నం ఇది. ఆయా వార్తా సంస్థలను ప్రజలు నమ్మడం లేదు. ఇరాన్‌లోని అణు కేంద్రాలు పూర్తిగా నాశనమయ్యాయి’ అని ట్రంప్ ట్రూత్ సోషల్‌లో పోస్టు పెట్టారు. అయితే, ఇంటెలిజెన్స్ నివేదికలోని అంశాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. యూఎస్ దాడుల్లో ఇరాన్‌కు పరిమితంగా నష్టం వాటిల్లిందని అందులో తెలపడం గమనార్హం. ఇరాన్‌లోని ఫోర్డో, నతాంజ్, ఇస్ఫహాన్ అణుకేంద్రాలపై బీ-2 స్పిరిట్ బాంబర్లతో అమెరికా భారీ దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో ఆయా అణుకేంద్రాలు నాశనం అయ్యాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Donald Trump), రక్షణశాఖ మంత్రి పీట్ హెగ్సెత్ (Pete Hegseth) ప్రకటించారు. అయితే, ఇంటెలిజెన్స్ నివేదికలు అందుకు వ్యతిరేకంగా ఉన్నాయి. మూడు అణుకేంద్రాలు లక్ష్యంగా దాడులు చేయగా అందులో ఫోర్డో, నతాంజ్‌లు పూర్తిగా నాశనం కాలేదని నివేదికలో పేర్కొంది. యురేనియం శుద్ధి చేసేందుకు ఉపయోగించే సెంట్రిఫ్యూజ్‌లు వంటి కీలక పరికరాలను ఇరాన్ కొన్ని నెలల్లోనే తిరిగి పునఃప్రారంభించుకోవచ్చని తెలిపింది. అంతేకాదు.. దాడులకు ముందే భారీగా శుద్ధి చేసిన యురేనియంను ఇరాన్ రహస్య ప్రాంతానికి తరలించినట్లు అందులో పేర్కొంది. అయితే ఈ సందర్భంగా ఫోర్డో కేంద్రం గురింంచి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇది దాదాపు 150–300 అడుగుల గట్టిగా ఉన్న పర్వతాల కింద నిర్మించబడిన సురక్షితమైన సైట్. అందుకే, US సైన్యం ఉపయోగించిన ‘బంకర్ బస్టర్’ పేలుడు బాంబులు కూడా దీన్ని పూర్తిగా నాశనం చేయలేకపోయినట్టు Pentagon నివేదిక పేర్కొంది. US బాంబర్లు 12 గుబు-57 బాంబులు ఫోర్డోపై, మరికొన్ని నతాంజ్‌పై వేయగా, US నేవీ సబ్మరిన్ ఇస్ఫహాన్‌పై దాదాపు 30 టోమాహాక్ క్షిపణులు ప్రయోగించింది.ఇక, బయటకు వచ్చిన ఈ నివేదికలను వైట్‌హౌస్ (White House) ధ్రువీకరించినప్పటికీ.. అందులోని అంశాలను కొట్టిపారేసింది. ‘ఇలాంటి ఆరోపణలతో కూడిన నివేదికలను లీక్ చేయడం అధ్యక్షుడు ట్రంప్‌ను కించపరచడమే. ఇరాన్ అణుకార్యక్రమాన్ని నిర్మూలించిన యుద్ధపైలట్ల ధైర్యసాహసాలను అప్రతిష్ఠపాలు చేసే ప్రయత్నం ఇది. 30 వేల పౌండ్లు కలిగిన 14 బాంబులను కచ్చితమైన లక్ష్యాలపై వేస్తే ఎంత నష్టం జరుగుతుందో అందరికీ తెలుసు. అవన్నీ మొత్తం ధ్వంసం అయ్యాయి’ అని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలినా లీవిట్ ఎక్స్‌లో పేర్కొన్నారు.“Everyone knows what happens when you drop fourteen 30,000 pound bombs perfectly on their targets: total obliteration.” - LEAVITT https://t.co/a6zCgFnheq— Aishah Hasnie (@aishahhasnie) June 24, 2025మరోవైపు.. సైనిక చర్యతో ఇరాన్ నుంచి అణు ముప్పు తొలగించినట్లు కాల్పుల విరమణ ఒప్పంద ప్రకటన సందర్భంగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు మంగళవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికా బాంబర్ల దాడుల్లోనూ ఇరాన్ అణు కేంద్రాలకు పరిమిత నష్టం వాటిల్లిందన్న నిఘా నివేదికలపై మరి ఆయన ఎలా స్పందిస్తారో చూడాలి!. -
కొవ్వాడ అణువిద్యుత్ కేంద్రం అభివృద్ధికేనా..?
ఆంధ్రప్రదేశ్‌లో మౌలిక సదుపాయాల అభివృద్ధిలో విద్యుత్ ముఖ్యమైనది. విభజన తరువాత విద్యుత్‌లో మనం మిగుల్లో ఉన్నాం. అయినా భవిష్యత్ కోసం విద్యుత్ అవసరం ఎంతైనా ఉంది. అయితే ఏ విద్యుత్ అవసరం అని పరిశీలించాలి. కొవ్వాడ అణు విద్యుత్ కేంద్రం నిర్మాణానికి రూ. 2లక్షల 80 వేల కోట్లు ఖర్చు అవుతుంది. నిర్మాణానికి కనీసం పది సంవత్సరాలకు పైగా సమయం పడుతుంది. ఇప్పటి అంచనాల ప్రకారం ఒక యూనిట్ విద్యుత్ ధర రూ.14లు ఉంటుంది. నిర్మాణ వ్యయం పెరిగితే ఇంకా పెరగవచ్చు. భారతదేశంలో విస్తారంగా బొగ్గును ఉపయోగించుకొని థర్మల్ పవర్ప్లాంట్లు ఏర్పడుతున్నాయి బొగ్గు గనులు లేని జపాన్‌లో విధిలేక నిర్మించిన అణు విద్యుత్ కేంద్రాలను కూడా క్రమేణా మూసివేస్తున్నారు. యురేనియంని ప్రపంచంలో అత్యధికంగా ఉత్పత్తి చేసే ఆస్ట్రేలియాలో ఒక్క అణు విద్యుత్ కేంద్రం కూడాలేదు. ఏపీలో కృష్ణా, గోదావరి బేసిన్లో పుష్కలంగా గ్యాస్ లభిస్తున్నది. దీని ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకుని కోనసీమ, గౌతమి, వేమగిరి, జీవీకే (విస్తరణ) విద్యుత్ ప్లాంట్లు నిర్మించారు. కాని కృష్ణా, గోదావరి బేసిన్‌లోని గ్యాస్‌ను రిలయన్స్ కంపెనీ గుజరాత్‌కి పట్టుకెళుతోంది. ఇక్కడ నిర్మించిన గ్యాస్ప్లాంట్కు గ్యాస్ ఇవ్వనందున 2000 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి కావడంలేదు. గ్యాస్ అయినా ఇవ్వండి! లేదా డబ్బులు అయినా చెల్లించండని ఈ కంపెనీలు సుప్రీం కోర్టులో రాష్ట్ర ప్రభుత్వంపై కేసు వేశాయి. విశాఖలోని హిందూజా, నెల్లూరులోని మరి కొన్ని థర్మల్‌ప్లాంట్లు ఉత్పత్తికి సిద్ధంగా ఉన్నాయి. సోలార్ విద్యుత్ కూడా మన రాష్ట్రంలో విస్తారంగా పెరుగుతు న్నది. రాయలసీమలో గాలిమరల విద్యుత్‌కు అధిక అవకాశం ఉంది. ఇన్ని వనరులు వున్నా ఏపీ ప్రభుత్వం అణువిద్యుత్ వైపు ఆలోచించడానికి అభివృద్ధి కంటే రాజకీయ కారణాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సొంత ప్రయోజనాలు ప్రధానంగా ఉన్నాయి. అణు విద్యుత్ అత్యంత ప్రమాద కరం. అణు రియాక్టరు అంటే ఆటంబాంబు. అణు విద్యుత్కేంద్రం అంటే భారీ ఆటం బాంబు. అణు విద్యుత్కేంద్రాల్లో వృథా పదార్థాలుగా మిగిలే ట్రైషియం, స్ట్రోన్షియం, ప్లూటోనియంలు భయంకరమైన రసాయన పదార్థాలు. ఇవి మట్టిలో, గాలిలో కలిసి కని పించవు. రంగు, రుచి, వాసన వుండవు. ఇవి రెండు లక్షల ఏళ్లవరకు ఉండి జీవకోటిని నాశనం చేస్తుంటాయి. అణువులు మనిషిలో చేరి తరతరాలను అనారోగ్యం పాలు జేస్తాయి. అణు రియాక్టరు సజావుగా నడుస్తుంటే వదిలే కాలుష్యమే ఇంత ప్రమాదం చేస్తుంది. ఇక అణు ప్రమాదమే సంభవిస్తే అక్కడ వేరే బాంబు అవసరంలేదు. కొవ్వాడ నుంచి 177 కి.మీ పరిధిలో జనావాసాలు అన్నీ ఖాళీ చేయించాలని అంతర్జాతీయ శాస్త్ర వేత్తలు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన పక్షంలో గంట నుంచి 6గంటల్లో జనాన్ని ఖాళీ చేయించాలని వీరు హెచ్చరించారు. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్‌లోని హిరోషిమా, నాగసాకిలపై జరిగిన అణు బాంబు దాడికి రెండు నగరాలు ధ్వంసమై లక్షల మంది మరణించారు. తరం తర్వాత తరం సంతానం కూడా వికలాంగులుగానే జన్మిస్తున్నారు. అణు రియాక్టర్లలో లీక్, ప్రమాదం వల్ల అమెరికాలోని ‘‘త్రీ మైల్ ఐలండ్’’, రష్యా (ఇప్పటి ఉక్రెయిన్)లోని చెర్నో బిల్, జపాన్‌లోని పుకుషిమాల్లో వేలాదిమంది మరణించారు. గుజరాత్‌లోని మితివిర్ధిలో అణు విద్యుత్ కేంద్రం పెట్టాలని నాటి కేంద్ర ప్రభుత్వం 2007లో నిర్ణయించింది. 2009లో నేషనల్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ దరఖాస్తు చేసింది. 2013 నాటికి పర్యావరణ, అటవీ, సీఆర్‌జెడ్ అనుమతులు పొందింది. అయితే ఆ అణు విద్యుత్ కేంద్రాన్ని ఆగమేఘాల మీద 2016 జూన్ 4వ తేదీన కొవ్వాడకు తరలించినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. గుజరాత్లో ప్రజలు వ్యతిరేకిస్తే ఉత్తరాం ధ్రలో శ్రీకాకుళం జిల్లా రణస్థలం వద్ద కొవ్వాడకు తరలించడం ఎవరి ప్రయోజనం కోసం? టీడీపీ ప్రభుత్వం కొవ్వాడలో తొలిదశలో సేకరించే 2,200 ఎకరాల్లో 1600 ఎకరాలు ప్రభుత్వ భూములనే పేరుతో మత్స్యకారులు, పేదల నుంచి బలవంతంగా చౌకగా లాక్కుంటోంది. దీనివల్ల స్థానికులకు ఎవ్వరికీ ఉద్యోగాలు రావు కానీ అమెరికాలో 40వేల ఉద్యోగాలు వస్తాయి. అమెరికాలోని వెస్టింగ్‌హౌస్ నిర్మించే ఎపి1000 రియాక్టర్లలో అత్య ధిక లాభాలు ఆ దే శానికే వె ళ్తాయి. ప్రమాదం జరిగితే ప్రజలకు, ప్రాణాలకు ఇతర ఆస్తు లకు నష్టపరిహారం అణు రియాక్టర్లు సరఫరా చేసిన కంపెనీలు భరించవు. మనమే భరిం చాలి. ఇటువంటి అణు కుంపటి ఉత్తరాంధ్రలో పెట్టడం ఉత్తరాంధ్ర విధ్వంసానికి తప్ప అభివృద్ధికి మాత్రం కాదు. అభివృద్ధి జపంతో ఒకవైపు ప్రజలను మోసగిస్తూ, మరో వైపు బహుళజాతి సంస్థలకు రెడ్ కార్పెట్ వేసి ఆంధ్రప్రదేశ్‌ను తాకట్టుపెట్టాలని తీవ్రంగా ప్రయ త్నిస్తున్నారు. అందుకే ప్రజానీకం తెలుగుదేశం కుట్రను తిప్పికొట్టాలి. వ్యాసకర్త సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు 94900 98789 - సీహెచ్. నరసింగరావు -
'కొవ్వాడలో భూముల సర్వేకు ఒప్పుకోం'
శ్రీకాకుళం (ఎచ్చెర్ల) : రణస్థలం మండలం కొవ్వాడలో ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేయదలచిన అణువిద్యుత్ కేంద్రానికి ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. సోమవారం మధ్యాహ్నం కోటపాలెం, అల్లివలస ప్రాంతాల్లో భూముల సర్వే కోసం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సీతారామారావు, తహసీల్దార్ ఎం. సురేష్ వచ్చారు. దాంతో అక్కడి ప్రజలు వారిద్దరినీ అడ్డుకున్నారు. కలెక్టర్ ప్రజలకు ప్యాకేజీలు ఇస్తామని, పునరావసం కల్పిస్తామని ఆయన చెప్పిన గ్రామస్థులు ఒప్పుకోలేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అణువిద్యుత్తు కేంద్రంతో ఈ ప్రాంతం నాశనమైపోతుందని చెప్పిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు అధికారంలోకి వచ్చాక నిర్మాణ పనులకు ఎలా పూనుకుంటున్నారంటూ గ్రామస్థులు అధికారులను నిలదీశారు. ఈ నేపథ్యంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొనడంతో రణస్థలం ఎస్సై సత్యనారాయణ రంగం ప్రవేశం చేశారు. భూమల సర్వే కోసం వచ్చిన కలెక్టర్ సీతారామారావును అధికారులను ఎస్సై అక్కడి నుంచి తీసుకెళ్లారు.