‘మీకోసమే ఎదురు చూస్తున్నాం’ | Iran army released a video showing commandos ready to confront US soldiers | Sakshi
Sakshi News home page

‘మీకోసమే ఎదురు చూస్తున్నాం’

Mar 31 2026 8:41 PM | Updated on Mar 31 2026 9:24 PM

Iran army released a video showing commandos ready to confront US soldiers

టెహ్రాన్‌: ఇరాన్‌పై యుద్ధంలో సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఇరాన్‌లో భూతల దాడులకు అమెరికా, ఇజ్రాయెల్ తమ సైన్యాన్ని మోహరిస్తున్నాయి. ఈ క్రమంలో శత్రు దేశాల సైన్యం భూతల దాడులకు దిగితే తాము ధీటుగా ఎదుర్కొంటామని హెచ్చరిస్తూ ఇరాన్‌  ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్స్‌ కోర్‌ (ఐఆర్‌జీసీ) సైన్యం ఓ వీడియోని విడుదల చేసింది.

ఇరాన్ ప్రెస్ టీవీ ప్రసారం చేసిన వీడియోలో ఇస్లామిక్ రిపబ్లిక్ సైన్యం తమ కమాండోల క్లిప్‌లను చూపిస్తూ అమెరికన్ సైనికులను ఎదుర్కొని ఓడించడానికి తాము సిద్ధంగా ఉన్నామని’ ప్రకటించింది. 59 సెకన్ల నిడివి గల ఈ వీడియోలో ఇరాన్ ప్రత్యేక దళాల కదలికలను వేగంగా చూపిస్తూ ‘దగ్గరకు రండి, మేము మీ కోసం ఎదురు చూస్తున్నాం’అనే సందేశం ఇస్తున్నట్లుగా ఉండటాన్ని గమనించొచ్చు. దీంతో పాటు సైనిక సామగ్రితో ఉన్న సైనికులు యుద్ధ విన్యాసాలు చేయడం, కఠినమైన భూభాగం గుండా దళాలు ముందుకు సాగడం చూడొచ్చు. మరో క్లిప్‌లో ఇరాన్ సైన్యానికి చెందిన ఒక భారీ క్షిపణి ప్రయోగ వాహనం తన ఆయుధాన్ని పేల్చడం, ఆ తర్వాత పేలుళ్లు సంభవించడం కనిపిస్తుంది.  

అమెరికా వైపు చర్యలు
అమెరికా వైట్ హౌస్ ప్రకారం..అదనపు సైన్యాన్ని పశ్చిమ ఆసియాకు పంపడం ద్వారా అమెరికా తాను అనుకున్న లక్ష్యాలను సాధించగలదని తెలిపింది. వైట్ హౌస్ ప్రెస్ కార్యదర్శి కరోలైన్ లీవిట్ మాట్లాడుతూ..‘ఎపిక్ ఫ్యూరీ ఆపరేషన్ లక్ష్యాలను సాధించడానికి పెంటగాన్ సైనిక వ్యూహాలను సిద్ధం చేస్తోంది’అని తెలిపారు. పెంటగాన్ ఇరాన్‌లో కొన్ని వారాలపాటు భూసైనిక చర్యలు చేపట్టే అవకాశాన్ని పరిశీలిస్తోంది. అయితే, ఇది పూర్తి స్థాయి ఆక్రమణ కాకుండా, లక్ష్యిత దాడుల రూపంలో ఉండవచ్చని సమాచారం.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement