సౌదీ నోటుపై భారత్‌ సరిహద్దు వివాదం పరిష్కారం

India, Saudi Arabia Resolve Incorrect Map Issue Ahead Of G20 - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : జీ 20 దేశాల శిఖరాగ్ర సదస్సు ఈ సారి సౌదీ అరేబియా వేదిక కానుంది. సౌది యువరాజు మహ్మద్‌ బీన్‌ సల్మాన్‌ అధ్యక్షతన ఈ సమావేశం డిసెంబర్‌ 21,22 తేదీల్లో జరుగనుంది. అయితే దీని కోసం సౌదీ అరేబియా ప్రత్యేకంగా రూపొందించిన 20 రియాల్‌ నోట్‌పై భారత ప్రాదేశిక సరిహద్దులను తప్పుగా చిత్రీకరించడం వివాదానికి దారీ తీసింది. సౌదీ తీరుపై భారత ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. జమ్మూకశ్మీర్‌, లద్ధాఖ్ ప్రాంతాలను భారత్‌లో అంతర్భాగంగా చూపించకపోవడం భారత ఆగ్రహానికి కారణమైంది. ఈ విషయంపై సౌదీ రాయబారి అషఫ్‌ సయీద్‌కు తక్షణమే దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని భారత విదేశాంగ ప్రతినిధి అనురాగ్‌ శ్రీవాస్తవ అక్టోబర్‌ 28న కోరగా.. సమస్య పరిష్కారానికి సౌదీ చొరవ చూపింది. 

దీనిపై స్పందించిన సౌదీ.. ఈ చిహ్నం కేవలం నమూనా మాత్రమే దీన్ని దేశంలో చేలామనిలో ఉండదని వివరించింది. ఈ మ్యాప్‌లో గిల్గిత్‌-బల్టిస్తాన్‌ పీఓకేను పూర్తిగా ప్రత్యేక భూభాగంగా చూపించడం గమనార్హం. వీడియా కాన్ఫరెన్స్‌ ద్వారా జరిగే ఈ సమావేశంపై ప్రధాని మోదీతో సౌదీ రోజు ఇదివరకే మాట్లాడారు. కోవిడ్‌ 19 మహమ్మారిని ప్రపంచ వ్యాప్తంగా కలిసి కట్టుగా ఎదుర్కోవడానికి తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఇరువురూ  ఆకాంక్షించారు. ఈ సమావేశంలో ప్రదాని నరేంద్ర మోదీ ప్రధానంగా కోవిడ్‌19 గురించి ప్రస్తావించనున్నారు. కరోనా మహమ్మారిని అన్నిదేశాలు కలిసికట్టుగా, సుస్థిరంగా దీన్ని ఎదుర్కోవాలనే అంశాలపై దృష్టి పెట్టనున్నట్లు, అందరు నాయకులు కరోనా నివారణా చర్యలు గురించి, ఉద్యోగుల పునరుద్ధరణ గురించి ప్రస్తావించే అవకాశం ఉంది.

 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top