ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్‌‌ హత్య కేసు.. నిందితుడి మగ్‌షాట్ విడుదల | FBI Releases Mugshot Of Charlie Kirk Suspect Tyler Robinson | Sakshi
Sakshi News home page

ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్‌‌ హత్య కేసు.. నిందితుడి మగ్‌షాట్ విడుదల

Sep 12 2025 9:27 PM | Updated on Sep 12 2025 9:27 PM

FBI Releases Mugshot Of Charlie Kirk Suspect Tyler Robinson

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సన్నిహితుడు చార్లీ కిర్క్‌(31) హత్య కేసులో ఎఫ్‌బీఐ అధికారులు పురోగతి సాధించారు. 48గంటల్లో నిందితుణ్ని అదుపులోకి తీసుకున్నారు. తాజాగా ఎఫ్‌బీఐ నిందితుడు టైలర్ రాబిన్సన్ మగ్‌షాట్ (అరెస్టు సమయంలో తీసిన ఫోటో)ను విడుదల చేసింది.  

టైలర్ రాబిన్సన్ అనే 22 ఏళ్ల యువకుడు. యుటా వ్యాలీ యూనివర్సిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో చార్లీ కిర్క్‌ను కాల్చి చంపాడు.ఈ ఘటన పట్టపగలు 3వేల మంది ప్రజల సమక్షంలో జరిగింది. రాబిన్‌సన్‌  అరెస్ట్ అనంతరం, అతని ఫోటోను ఎఫ్‌బీఐ అధికారికంగా విడుదల చేయడం ద్వారా ప్రజలకు సమాచారం ఇవ్వడమే కాకుండా,కేసు విచారణలో పారదర్శకతను పెంచే ప్రయత్నం చేస్తున్నారు.

ఎఫ్‌బీఐ స్థానిక పోలీసు శాఖలతో కలిసి ఈ కేసును విచారిస్తోంది. చార్లీ కిర్క్‌ను హత్య చేయడానికి నిందితుడి మోటివ్, తుపాకీని ఎక్కడి నుంచి సేకరించారు. సంఘటనకు ముందు జరిగిన పరిణామాలపై దృష్టి పెట్టారు. రాబిన్సన్‌ను ఇప్పటికే విచారిస్తున్నట్లు సమాచారం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement