టర్కీ, గ్రీస్‌లో భారీ భూకంపం

Earthquake Hits In Turkey And Greece With Magnitude Of 7 - Sakshi

టర్కీ : పశ్చిమ టర్కీ, గ్రీస్‌లో శుక్రవారం భారీ భూకంపం సంభవించింది. కాగా రిక్టర్‌ స్కేలుపై దీని తీవ్రత 7గా నమోదైంది. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు ప్రాణ భయంతో రోడ్ల మీదకు పరుగులు తీశారు. భూకంపం దాటికి ఆరు భవనాలు కూలడంతో పాటు.. సెంట్రల్‌ ఇజ్మీర్‌లోని 20 అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. కాగా ఈ భూకంపం దాటికి పలువురు మరణించారని.. అయితే ప్రాణనష్టం అధికంగానే ఉండే అవకాశం ఉందని టర్కీ ప్రభుత్వం పేర్కొంది.

కాగా భూకంపం దాటికి ఏజియన్‌ సముద్రంలో చిన్నపాటి సునామీ సంభవించడంతో ఇజ్మీర్‌ పరిధిలోని సమోస్‌ తీర ప్రాంతానికి సముద్రం చొచ్చుకొచ్చింది. ఇజ్మీర్‌ పక్కనున్న ఏజియన్‌ సముద్రంలో 16 కి.మీ లోతులో భూకంప కేంద్రం కేంద్రీకృతమై రిక్టర్‌ స్కేలుపై 7 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు టర్కీ డిజాస్టర్‌ అండ్‌ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్‌ తెలిపింది.  భూకంపం కారణంగా సంభవించిన సునామీతో సముద్రపు నీరు వీధుల్లోకి రావడం కనిపించింది. కొన్నిచోట్ల బహుళ అంతస్తుల భవనాలు కుప్పకూలంతో వందల సంఖ్యలో వాహనాలు ధ్వంసమయ్యాయి. గ్రీస్‌ రాజధాని ఏథెన్స్‌ సహా పలు ప్రాంతాలలోనూ భూకంపం సంభవించింది

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top