అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి ఇరాన్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ తదుపరి చర్చలకు వచ్చినా.. రాకపోయినా తనకు సంబంధం లేదని అసలు ఆవిషయం తాను పట్టించుకోనని తెలిపారు. ఇటీవల జరిగిన చర్చలు విఫలమైన నేపథ్యంలో ట్రంప్ మాటలు మరోసారి హీట్ పెంచాయి.
ప్రస్తుతం పశ్చిమాసియా యుద్ధంలో తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం జరుగుతుంది. ఇటీవల జరిగిన చర్చలు విఫలమవడంతో ట్రంప్ మరోసారి విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇదివరకే హార్ముాజ్‌ను దిగ్భందిస్తామని వ్యాఖ్యానించారు. అయితే దానికి ఇరాన్ సైతం ఘాటుగానే బదులిచ్చింది. తాజాగా మరోసారి ట్రంప్ చర్చల విషయమై మాట్లాడారు.
ట్రంప్ మాట్లాడుతూ "అసలు ఇరాన్ మరోసారి చర్చలకు తిరిగి వస్తుందో లేదో తెలియదు. ఒకవేళ వారు చర్చలకు వచ్చినా రాకపోయినా ఆ విషయం నేనసలు పట్టించుకోను. ఇరాన్ దేశం దాదాపు నాశనమైంది. ప్రస్తుతం ఆదేశం చాలా దీన పరిస్థితుల్లో ఉంది. చర్చలు విఫలమైనప్పటికీ వారి వద్ద అణ్వాయుధం ఉండదు. ఉండే అవకాశం లేదు". అని అన్నారు.
అయితే ఇరాన్ మౌళిక సదుపాయాలపై అమెరికా పెద్దగా దాడి చేయలేదని ఆ దేశంలోని ఒకే వంతెనను కూల్చివేసిందని, అది కూడా వారి తప్పేనన్నారు. హర్ముజ్‌ను తెరుస్తామని అమెరికా మాటిచ్చి ఇప్పుడు దానిని తప్పారని ఇరాన్ పెద్ద అబద్ధాల కోరు దేశమన్నారు. అయితే ప్రస్తుతం ఇరు దేశాల మధ్య నడుస్తున్న సీజ్‌ఫైర్ ఏప్రిల్ 22 వరకూ కొనసాగుతుందన్నారు. ఇరాన్ ఓడరేవుల దిగ్భందనం మెుదలవుతుందన్నారు.
పశ్చిమాసియా యుద్ధం శాంతిస్తుందనుకున్న తరుణంలో ప్రస్తుతం ఇరాన్- అమెరికా మధ్య మరోసారి ఉద్రిక్తతలు పెరిగేలా ఉన్నాయి. హర్ముజ్‌ను దిగ్భందించాలని అమెరికా నావికాదళానికి ట్రంప్ ఆదేశాలివ్వడం.. అలా చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఇరాన్ హెచ్చరించడంతో మరోసారి ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి.


