బ్రిటన్ రాజు బాడీగార్డులకు నకిలీ చేతులు! నెటిజన్ల అయోమయం

Do King Charles Bodyguards Use Fake Hands - Sakshi

లండన్‌: బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ బాడీగార్డులకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్లు బాడీగార్డులు కృత్రిమ చేతులు ఉపయోగిస్తున్నారా? అనే అయోమయానికి గురౌతున్నారు. వాళ్ల అసలు చేతులను కోటు లోపల దాచుకుని ఫేక్ చేతులను బయటకు ప్రదర్శిస్తున్నారా? అని చర్చ జరుగుతోంది.

ప్రముఖులకు భద్రత కల్పించే బాడీగార్డులు క్షణం ఏమరపాటుగా ఉన్నా దాడులు జరిగే ప్రమాదం పొంచి ఉంటుంది. అందుకే వారు కూడా కొన్ని టెక్నిక్స్ పాటిస్తూ తమ యజమానుల కోసం ప్రాణాలను పణంగా పెట్టి రక్షణ కల్పిస్తుంటారు. ఇలాంటి టెక్నిక్స్‌లో ఫేక్ చేతులు ధరించడం కూడా ఒకటి కావడం గమనార్హం.

అయితే ఫేక్ చేతుల విషయం కొత్తదేమీ కాదు. 2017లో అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సీక్రెట్ సర్వీస్ బాడీగార్డు తన చిటికెన వేలుని వింతగా పట్టుకున్నప్పుడే ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అది కృత్రిమ చేతి అయి ఉంటుందని అంతా అనుమానించారు. బాడీగార్డులు ఇలా కృత్రిమ చేతులు ధరించినప్పుడు కోట్ లోపల అసలు చేతులతో ఆటోమేటిక్ గన్ పట్టుకుని సిద్ధంగా ఉంటారని చెబుతుంటారు. ఇలాంటి సందర్భాల్లో ఎఫ్‌ఎన్‌-పీ90 గన్‌ను ఊపయోగిస్తారట. ఎవరికీ అనుమానం రాకుండా కోటు లోపల పెట్టుకుని భద్రత కల్పించేందుకు ఇది అనువుగా ఉంటుందట.

క్లారీటీ లేదు..
అయితే బ్రిటన్‌లో బాడీగార్డులు ఆయుధాలు కలిగిఉండటానికి వీల్లేదు. అందుకే కింగ్ చార్లెస్ బాడీగార్డులు కోటు  లోపల చేతులతో గన్స్ పట్టుకునే అవకాశం లేదు. కానీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు మాత్రం నెటిజన్లను అయోమయానికి గురి చేస్తున్నాయి. అసలు బాడీగార్డులు కృత్రిమ చేతులు నిజంగానే ధరించారా? అనే విషయంపై స్పష్టత రావడంలేదు.

కొందరేమో కింగ్ చార్లెస్ బాడీగార్డులు కచ్చితంగా కృత్రిమ చేతులు ధరించారు అంటుంటే.. మరికొందరేమే ఇవి ఫేక్ చేతుల్లా లేవని అంటున్నారు. అయితే ఈ విషయంపై బాడీగార్డులు కూడా నిజాన్ని చెప్పే అవకాశం లేదు. అసలు విషయం తెలిస్తే కింగ్ చార్లెస్ భద్రతకు ముప్పు ఉంటుందని వారు భావిస్తారు.
చదవండి: చైనాలో ఘోర ప్రమాదం.. బస్సు బోల్తాపడి 27మంది దుర్మరణం

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top