‘తియాన్మెన్‌ స్క్వేర్‌’ సంస్మరణపై చైనా ఉక్కుపాదం

China silencing of Tiananmen tributes extends to Hong Kong - Sakshi

హాంకాంగ్‌: హాంకాంగ్‌లో జరగబోయే తియాన్మెన్‌ స్క్వేర్‌ సంస్మరణ కార్యక్రమాలపై చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో హాంకాంగ్‌లో ఎలాంటి స భలు, సమావేశాలు, కార్యక్రమాలకు అనుమతి లే దని తేల్చిచెప్పింది. ఆంక్షలను ఉల్లంఘిస్తే కఠిన చ ర్యలు తప్పవని హెచ్చరించింది. చైనాలో ప్రజాస్వామ్య వ్యవస్థ కావాలని డిమాండ్‌ చేస్తూ 1989 జూన్‌ 4న బీజింగ్‌లోని తియాన్మెన్‌ స్క్వేర్‌లో వేలాది మంది విద్యార్థులు సమావేశమయ్యారు. చైనా సైన్యం వారిపై దమనకాండ సాగించింది. ఈ ఘటనలో వందల మంది ప్రాణాలు కోల్పోయా రు. ఈ మా రణకాండలో బలైన విద్యార్థుల త్యాగాలను స్మరించుకొనేందుకు ప్రతిఏటా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు.

అయితే, చైనా కమ్యూనిస్టు ప్రభుత్వ ఆంక్షలు పెరగడంతో ప్రధాన సంస్మరణ కార్యక్రమాలను హాంకాంగ్‌లో నిర్వహిస్తున్నారు. కరోనా వల్ల హాంకాంగ్‌లోని విక్టోరియా పార్క్‌ పరిసరాల్లో ఈసారి వీటికి అనుమతి ఇవ్వ బోమని చైనా సర్కారు తేల్చిచెప్పింది. గత ఏడాది విక్టోరియా పార్క్‌లో వేలాదిమంది సంస్మరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. మరోవైపు హాంకాంగ్‌లో క్యాండిల్‌ లైట్‌ ర్యా లీకి పిలుపునిచ్చిన చౌ హాంగ్‌ తుంగ్‌ అనే ఉద్యమకారిణిని, సంస్మరణ కార్యక్రమాలపై సోషల్‌ మీడియాలో ప్రచారం సాగిస్తున్న ఓ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆంక్షలున్నప్పటికీ, జనం  పెద్ద సంఖ్యలో విక్టోరియా పార్క్‌ వద్దకు చేరుతున్నట్లు సమాచారం.  
 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top