ఇరాన్‌కు చైనా ఆయుధాలు | China preparing to supply weapons to Iran | Sakshi
Sakshi News home page

ఇరాన్‌కు చైనా ఆయుధాలు

Apr 12 2026 5:24 AM | Updated on Apr 12 2026 5:24 AM

China preparing to supply weapons to Iran

అమెరికా నిఘా వర్గాల ఆరోపణ 

వాషింగ్టన్‌: పశ్చిమాసియాలో యుద్ధం ముగించేందుకు ఓవైపు పాకిస్తాన్‌లో అమెరికాతో చర్చలు జరిపేందుకు ప్రతినిధి బృందాన్ని పంపిన ఇరాన్‌ మరోవైపు ఆయుధాల సమీకరణలో బిజీగా మారిందన్న వార్త చర్చనీయాంశమైంది. మిత్రదేశం చైనా నుంచి గగనతల రక్షణ వ్యవస్థలను రహస్యంగా తెప్పించుకుంటోందని అమెరికా నిఘా వర్గాలు తాజాగా ఆరోపించాయి. ఈ మేరకు సీఎన్‌ఎన్‌ వార్తాసంస్థ ఒక కథనం ప్రచురించింది. 

భుజంపై మోస్తూ సులభంగా ఎక్కడికైనా తీసుకెళ్లగల మ్యాన్‌ప్యాడ్‌ ఆయుధాలను ఇరాన్‌కు చైనా తరలిస్తోందని అమెరికా నిఘా వర్గాలు తెలిపాయి. మ్యాన్‌ప్యాడ్‌ సాయంతో శత్రువుల హెలికాప్టర్లు, డ్రోన్లను కూల్చేయవచ్చు. హెలికాప్టర్ల ఇంజిన్లు, డ్రోన్ల వేడిమిని గుర్తించే ‘హీట్‌–సీకింగ్‌’సాంకేతికతతో ఇది పనిచేస్తుంది. అమెరికా ఎఫ్‌–15ఇ యుద్ధ విమానం, బ్లాక్‌హాక్‌ హెలికాప్టర్లను ఇరాన్‌ ఇటీవల ఇవే యాంటీ–ఎయిర్‌–మిస్సైళ్ల వ్యవస్థలతో నేలకూల్చిందని కథనాలు వెలువడ్డాయి. 

నేరుగా పంపకుండా వేరే దేశానికి వీటిని విక్రయించి ఆ దేశం నుంచి ఇరాన్‌ కొనుగోలుచేసేలా వ్యూహం రచించిందని సమాచారం. ఇ చైనా అంతర్జాతీయ ఆంక్షల కొరడా దెబ్బల నుంచి తప్పించుకుంటోందని అమెరికా ఆరోపించింది. రష్యా నుంచి సైతం ఇలాగే పనిచేసే వెర్బా అనే యాంటీ–ఎయిర్‌ మిస్సైళ్ల వ్యవస్థలను ఇరాన్‌ కొనుగోలుచేస్తోందని వార్తలొచ్చాయి. ఘన రాకెట్‌ ఇంధనం తయారీవాడే ముడిపదార్థం సోడియం పర్‌క్లోరేట్‌తో నిండిన రెండు సరుకు రవాణా నౌకలను ఇప్పటికే ఇరాన్‌కు చైనా పంపిందని తెలుస్తోంది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement