China Faces Fresh COVID: చైనాలో మళ్లీ కరోనా విజృంభణ

China Faces Fresh COVID Outbreak Flights Cancelled And Closed Schools - Sakshi

బీజింగ్‌: చైనాలో తాజాగా మళ్లీ కరోనా విజృంభిస్తోంది. ఈ క్రమంలో చైనా ప్రభుత్వం వందలకొద్ది విమానాలను రద్దు చేయడం, పాఠశాలలను మూసివేయడం వంటి కఠిన ఆంక్షలను విధించింది. అంతేకాదు చైనా దేశవ్యాప్తంగా సార్స్‌-కోవీ-2కి సంబంధించిన సాముహిక పరీక్షను కూడావేగవంతం చేయనుంది. అయితే ఇతర దేశాలు మాదిరిగా కాకుండా చైనా మాత్రం ఇంకా లాక్‌డౌన్‌ని కొనసాగించడమే కాక పొరుగుదేశాలతో ఉన్న సరహద్దులను కూడా మూసివేసిన సంగతి తెలిసిందే.

(చదవండి: తింగరోడు.. లైవ్‌ టెలికాస్టింగ్‌లో ఫోన్‌ చోరీ! కట్‌ చేస్తే..)

క్రాస్‌ ప్రావిన్షియల్‌ పర్యటనలో ఉన్న ఏడుగురు వృద్ధ బృందానికి నిర్వహించిన కోవిడ్‌ -19 పరీక్షలో కేసులు వెలుగు చూశాయి. పైగా ఈ వృద్ధ బృందం జియాన్, గన్సు ప్రావిన్స్, మంగోలియాకు వెళ్లే ముందు షాంఘైని కూడా సందర్శించారు. దీంతో బీజిగ్‌తో సహా కనీసం ఐదు ప్రావీన్స్‌లు కరోనా ప్రభావం ఉండోచ్చని చైనా ప్రభుత్వం తన నివేదికలో పేర్కొంది. ఈ మేరకు గత కొన్ని రోజులగా ఉత్తర వాయువ్య ప్రాంతాల నుంచి  కొత్త కేసులు నమోదవుతున్న‍ట్లు కూడా  చైనా గుర్తించింది.  అయితే చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ గురువారం నాటికి తాజాగా 13 కోవిడ్‌ -19 కేసులు నమోదైనట్లు పేర్కొంది.

(చదవండి: అందుకే ఇంగ్లండ్‌ నుంచి వస్తున్నారు)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top