Viral: వధువుకు 60 కేజీల బంగారం బహుకరించిన వరుడు | Bride Wears 60 kg Gold Necklace Gifted By Husband On Wedding At China | Sakshi
Sakshi News home page

Viral: వధువుకు 60 కేజీల బంగారం బహుకరించిన వరుడు

Oct 13 2021 9:23 PM | Updated on Oct 13 2021 9:32 PM

Bride Wears 60 kg Gold Necklace Gifted By Husband On Wedding At China - Sakshi

వివాహ వేడుకలో పెళ్లి కూతురు బంగారు ఆభరణాలతో మెరిసిపొంది. కొన్ని సంపన్న కుటుంబాల్లో పెళ్లి కూతురుకు బంధువులు, అతిథులు బంగారాన్ని కూడా బహుకరిస్తారు. అయితే వివాహ వేడుకనలో వధువుకు కాబోయే భర్త భారీ బంగారు ఆభరణాలు కానుకగా ఇచ్చి ఆశ్చర్యపరిచాడు. కాబోయే భర్త ఇచ్చిన భారీ బంగారు ఆభరణాలను వధువు ధరించడం సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది.

చైనాలోని హుబే ప్రావిన్స్‌లో ఓ వివాహ వేడుక జరిగింది. వివాహ మండపంలోనే కాబోయే భర్త వధువకు 60 కేజీల బంగారాన్ని బహుకరించాడు. సెప్టెంబ‌ర్ 30న జ‌రిగిన ఈ వివాహ వేడుక‌లో భారీ బంగారు ఆభ‌ర‌ణాలు ధ‌రించిన వ‌ధువును బంధువులు, అతిథులు ఆశ్చర్యపోయారు.

ఒక్కోటి కిలో బ‌రువున్న 60 బంగారు నెక్లెస్‌ల‌ను వరుడు ఆమెకు కానుక‌గా అందించాడు. తెల్లటి వెడ్డింగ్ డ్రెస్ ధ‌రించి త‌న చేతిలో గులాబీలు ప‌ట్టుకుని ఒంటి నిండా న‌గ‌ల‌తో ఆమె అందంగా ముస్తాబైంది. వరుడు సంప‌న్న కుటుంబానికి చెందిన వ్య‌క్తి కావ‌డంతో వ‌ధువును బంగారు ఆభ‌ర‌ణాల్లో ముంచెత్తాడు. భారీ బంగారు ఆభరణాలతో క‌నిపించే  వ‌ధువు ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌ అవుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement