అలాంటివి మేము అంగీకరించం.. చర్యలు తీసుకుంటాం! భారత్‌కి హామీ

Australia Said We Will Not Accept Strict Action Against Temple Vandalism - Sakshi

భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ మేరకు మోదీ పునరుత్పాదక ఇంధన, వాణిజ్యం, రక్షణ రంగాలలో ఇరు దేశాల మధ్య సంబంధాలను పెంపొందించే లక్ష్యంతో ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని అల్బనీస్‌తో విస్తృత చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఆస్ట్రేలియాలో ఆలయాల ధ్వసం ఘటనలపై కూడా తాము ఇరువురం మాట్లాడుకున్నట్టు మోదీ తెలిపారు.

తాను మరోసారి ఈ ఆలయ ధ్వంస గురించి ఆల్బనీస్‌తో చర్చించానని, ఇలాంటి విధ్వంసాలకి పాల్పడే వారిపై తప్పక కఠిన చర్యలు తీసుకుటామని మరోసారి హామీ ఇచ్చారని చెప్పారు. అంతేగాదు భారత్‌ ఆస్ట్రేటియా మధ్య స్నేహపూర్వక సంబంధాలను, వారి చర్య లేదా ఆలోచనల ద్వారా దెబ్బతీసే ఏ అంశాలను అంగీకరించమని చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి అంశాలకు వ్యతిరేకంగా కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హామీ ఇచ్చారని తెలిపారు.

ఇదిలా ఉండగా జనవరి 12న ఆ‍స్ట్రేలియాలో మిల్‌పార్క్‌లోని బీఏపీఎస్‌ స్వామి నారాయణ మందిర్‌, జనరవి 16న క్యారమ్‌ డౌన్స్‌లోని శ్రీ విష్ణు దేవాలయాలు హిందూ వ్యతిరేక శక్తులచే ధ్వసమయ్యాయి. కాగా, సిడ్నీలోని ర్యాలీ అల్బనీస్‌ భారత ప్రధాని మోదీతో కలసి పాల్గొని భారతీయ ప్రజలను ఉద్దేశించి మాట్లాడిని ఒకరోజు తర్వాత ఈ చర్చలు జరిగాయి.  

(చదవండి: జోబైడెన్‌ హత్యకు యువకుడి యత్నం.. ట్రక్కుతో వైట్‌హౌస్‌పై దాడి)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top