ఆ టోకెన్‌తో థియేటర్‌లో జీవితాంతం ఉచితంగా సినిమాలు | Sakshi
Sakshi News home page

ఆ టోకెన్‌తో థియేటర్‌లో జీవితాంతం ఉచితంగా సినిమాలు

Published Tue, Oct 31 2023 2:01 PM

250 Year old Silver Ticket Promising Free Theatre Shows for Life - Sakshi

ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని అంటారు. చాలామంది పాత వస్తువులను జాగ్రత్తగా దాచేందుకు ఇష్టపడతారు. అయితే కొన్నేళ్ల తర్వాత అవి బయట పడినప్పుడు వాటిని చూసినవారు తెగ ఆశ్యర్యపోతుంటారు. అయితే ఇప్పుడు మనం తెలుసుకునేది దీనికి భిన్నం. 1766 నాటి ‘థియేటర్ టోకెన్’ ఇప్పుడు బ్రిటన్‌లో వేలం వేస్తున్నారు. దీని ప్రత్యేకత ఏమిటంటే ఆ టొకెన్‌ ఉంటే థియేటర్లో రోజూ సినిమాలను  ఉచితంగా చూడవచ్చు. అయితే ఈ టోకెన్‌ కొనుగోలు చేయాలంటే భారీగా సొమ్ము చెల్లించాలివుంటుంది.  

గార్డియన్ తెలిపిన వివరాల ప్రకారం బ్రిటన్‌లోని బ్రిస్టల్ ఓల్డ్ విక్ థియేటర్‌ను నిర్మించివారు ముందుగా 50 ప్రత్యేకమైన టోకెన్లు తయారు చేశారు. ఈ టోకెన్‌లు కలిగినవారు థియేటర్‌లో ప్రదర్శించే ప్రతీ సినిమాను ఉచితంగా చూడవచ్చని ఆ టోకెన్‌లపై రాసి ఉంది. 250 ఏళ్లపాటు దాచివుంచిన ఈ టోకెన్లు ఇటీవల బయటపడ్డాయి. ఇప్పుడు వీటిని వేలం వేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. థియేటర్ ప్రారంభ సమయంలో ఈ 50 టోకెన్లను తయారు చేశారు. కొందరు వాటిని వినియోగించారు. మరికొందరు విక్రయించారు. ఈ నేపధ్యంలో అనేక నకిలీ టోకెన్లు కూడా తయారయ్యాయట.

విల్ట్‌షైర్‌లోని హెన్రీ ఆల్డ్రిడ్జ్ అండ్‌ సన్ వేలం హౌస్‌లో  ఈ టోకెన్లు విక్రయిస్తున్నట్లు వేలం హౌస్  ప్రతినిధి మీడియాకు తెలిపారు. 1766లో థియేటర్‌ వాటాదారు విలియం జోన్స్‌కు టోకెన్‌ నంబర్ 35ను జారీ చేసినట్లు రికార్డులు చెబుతున్నాయి. 1815 నాటికి ఇది ప్రముఖ బ్రిస్టల్ బ్లూ గ్లాస్ తయారీదారు అయిన జాన్ వాధమ్ దగ్గరకు చేరింది. ఈ టోకెన్ ఇప్పటికీ ఈ కుటుంబం వద్ద ఉంది. మరో టోకెన్ అష్టన్ కోర్ట్‌కు చెందిన స్మిత్ కుటుంబం దగ్గరుంది. 

వేలం నిర్వహిస్తున్న సంస్థ ఒక టోకెన్ ధరను 2,500 పౌండ్లు అంటే సుమారు రూ. 2.51 లక్షలుగా నిర్ణయించింది. బ్రిస్టల్ ఓల్డ్ విక్ థియేటర్ ప్రతినిధి మాట్లాడుతూ మేము ఈ టోకెన్‌ల వినియోగానికి అనుమతిస్తాం. వారికి జీవితాంతం ఉచితంగా సినిమాలు చూసే అవకాశాన్ని కల్పిస్తాం. కాగా ఈ థియేటర్‌ను ‘థియేటర్ రాయల్’ అని పిలుస్తారు దీనిని కింగ్ స్ట్రీట్‌లో 1764-1766 మధ్య కాలంలో నిర్మించారు. 
ఇది కూడా చూడండి: 21 ఏళ్లకు యాసిడ్‌ బాధితురాలికి న్యాయం!

Advertisement
 
Advertisement